చంద్రబాబు నారా లోకేష్ పై అదిరిపోయే సెటైర్లు వేసిన బీజేపీ నేత కన్నా లక్ష్మీనారాయణ…!

Written By Siddhu Manchikanti | Updated: July 21, 2019 14:05 IST
చంద్రబాబు నారా లోకేష్ పై అదిరిపోయే సెటైర్లు వేసిన బీజేపీ నేత కన్నా లక్ష్మీనారాయణ…!

చంద్రబాబు నారా లోకేష్ పై అదిరిపోయే సెటైర్లు వేసిన బీజేపీ నేత కన్నా లక్ష్మీనారాయణ…!
 
తన రాజకీయ వ్యూహాలతో తెలుగుదేశం పార్టీని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు ఏపీ బీజేపీ నేత అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ. ఇప్పటికే చాలా మంది టీడీపీ నేతలు బిజెపి పార్టీలో చేరడానికి రంగం సిద్ధం చేసుకున్న నేపథ్యంలో కన్నా లక్ష్మీనారాయణ చంద్రబాబుపై మరియు నారా లోకేష్ పై అదిరిపోయే సెటైర్లు వేశారు. టిడిపి పార్టీ అధ్యక్షుడు చంద్రబాబుకు వయసు అయిపోయిందని, ఆయన కుమారుడు లోకేష్ కు వాయిస్ లేదని బిజెపి అద్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ వ్యాఖ్యానించారు. చిత్తూరు జిల్లాలో జరిగిన బీజేపీ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాలలో పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎపిలో తుడిచిపెట్టుకుపోయిందని, టిడిపి కోలుకునే పరిస్థితి లేదని ఆయన అన్నారు దానికి కారణం చంద్రబాబు వయసు అయిపోతే, లోకేష్ కు వాయిస్ లేకపోవడమేనని ఆయన అన్నారు.దీంతో టీడీపీ నేతల్లో ఆత్మస్థైర్యం దెబ్బతిందన్నారు. పొరుగునున్న కర్ణాటకలో కుమార స్వామి సంకీర్ణ సర్కారు వెంటిలేటర్‌పై నడుస్తోందని కన్నా అన్నారు. అక్కడ అధికార పక్షానికి చెందిన 15 మంది ఎమ్మేల్యేలు రాజీనామాలు చేస్తే వాటిని స్పీకర్‌ ఆమోదించకుండా సర్కారును కాపాడే యత్నం చేస్తున్నారని ఆరోపించారు.
Top