కాపులను మోసం చేసింది చంద్రబాబా..? జగన్నా..?

Written By Siddhu Manchikanti | Updated: July 21, 2019 14:09 IST
కాపులను మోసం చేసింది చంద్రబాబా..? జగన్నా..?

కాపులను మోసం చేసింది చంద్రబాబా..? జగన్నా..?
 
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలను డిసైడ్ చేసే వారిలో కాపు ఓటు బ్యాంక్...కీలకమని అందరికీ తెలిసినదే. 2014 ఎన్నికల్లో ఎప్పుడైతే కాపు సామాజిక వర్గానికి చెందిన పవన్ కళ్యాణ్ చంద్రబాబుకి మద్దతు తెలిపారో..అప్పుడు 2 గోదావరి జిల్లాలో రాజకీయ మొత్తం ఒక్కసారిగా మారిపోయాయి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావటం జరిగింది. అయితే ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు కాపులను ఉద్దేశించి...కాపులను బీసీల్లో చేరుస్తానని హామీ ఇచ్చి తర్వాత అధికారంలోకి వచ్చి హామీ విషయంలో చంద్రబాబు తప్పి పోవడం జరిగింది. దీంతో చంద్రబాబు పై కాపులు తీవ్రంగా ఆగ్రహం చెందడం జరిగింది. అయితే కాపుల విషయంలో వైసిపి పార్టీ అధినేత జగన్ ఆచరణ కాని హామీలు ఇచ్చి కాపులను మోసం చేయడం నావల్ల కాదు అంటూ బహిరంగంగానే తెలియజేసి తన రాజకీయ స్ట్రాటజీ కాపులపై ఏంటో స్పష్టంగా చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు ప్రస్తుతం ఆంధ్రరాష్ట్రంలో జగన్ ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవటంతో..అసెంబ్లీలో కాపుల రిజర్వేషన్ అంశంపై చర్చ జరుగుతోంది. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీలో ముఖ్యమంత్రి జగన్ మాట్లాడుతూ..చంద్రబాబు లా మోసాలు చేయనని చెప్పారు.తాను చెప్పినట్లు కాపులకు రెండువేల కోట్ల రూపాయలు కేటాయించానని అన్నారు. నా లెక్కలు ఎప్పుడూ స్పష్టంగా ఉంటాయని...నేను ఇచ్చే హామీలు కూడా ఖచ్చితంగా ఉంటాయని అన్నట్టుగా జగన్ కాపులను ఉద్దేశించి అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాలలో తెలిపారు. మొత్తం మీద చూసుకుంటే జగన్ ...చంద్రబాబు కంటే కాపుల విషయంలో చాలా స్పష్టమైన వైఖరితో ఉన్నాడని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.
Top