రుణం చెల్లించు...పదవి పట్టుకో సుజనా కి బంపర్ ఆఫర్ ఇచ్చిన కేంద్రం..?

Written By Siddhu Manchikanti | Updated: July 22, 2019 13:57 IST
రుణం చెల్లించు...పదవి పట్టుకో సుజనా కి బంపర్ ఆఫర్ ఇచ్చిన కేంద్రం..?

రుణం చెల్లించు...పదవి పట్టుకో సుజనా కి బంపర్ ఆఫర్ ఇచ్చిన కేంద్రం..?
 
ఇటీవల మాజీ కేంద్రమంత్రి సుజనా చౌదరి బీజేపీలో చేరకముందు తెలుగుదేశం పార్టీలో ఉన్న సమయంలో కేంద్రంలో ఉన్న విచారణ సంస్థలు సుజనా చౌదరి కి సంబంధించిన ఆస్తులపై దాడులు చేయడం జరిగింది. దీంతో ఆ తర్వాత కొన్ని పరిణామాలు సుజనా చౌదరి తెలుగుదేశం పార్టీని వీడి బీజేపీలో చేరడం తో ఆంధ్ర రాజకీయాల్లో రాజకీయ పరిణామాలు ఒక్కసారిగా మారిపోయింది. ఇటువంటి నేపథ్యంలో తాజాగా సుజనా చౌదరి కి కేంద్రం ఒక బంపర్ ఆఫర్ ప్రకటించినట్లు ఆ పార్టీ ఎమ్మెల్యే పివి మాదవ్ మాట్లాడిన మాటలు బట్టి అర్థమవుతుంది.
 
ఇటీవల ఆ పార్టీ ఎమ్మెల్సీ పివి మాదవ్ మాట్లాడుతూ ఎపి నుంచి కేంద్రంలో ఒక మంత్రి ఉంటారని వ్యాఖ్యానించారు. ఎపి నుంచి బిజెపికి ఒక్క ఎమ్.పి కూడా లేరు.ఈ మద్య టిడిపి రాజ్యసభ సభ్యులు నలుగురిని బిజెపిలో విలీనం చేసుకున్నారు. వారిలో గరికపాటి మోహన్ రావు తప్ప మిగిలినవారు ఎపి వారే. ఇప్పటికే సుజనా చౌదరి కేంద్రంలో మోడీ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నారు. టిడిపి కేంద్రం నుంచి బయటకు రావడంతో సుజనా పదవిని వదలుకోవల్సి వచ్చింది.తాజాగా ఆయన మళ్లీ మంత్రి అవ్వవచ్చని కొందరు బిజెపి నేతలు చెబుతున్నారు. అందుకు ఒక షరతు పెడుతున్నారట. ముందుగా ఆయన బ్యాంకులకు చెల్లించవలసిన రుణ బాకీలను తీర్చాలని ,అప్పుడు కేంద్రంలో పదవి ఇవ్వడానికి ఇబ్బంది ఉండదని భావిస్తున్నారని బిజెపి నేతలు అంటున్నారు.
Top