కేంద్రం ఇచ్చిన లేఖకు వెనక్కి తగ్గిన ప్రపంచ బ్యాంక్..!

Written By Siddhu Manchikanti | Updated: July 22, 2019 14:00 IST
కేంద్రం ఇచ్చిన లేఖకు వెనక్కి తగ్గిన ప్రపంచ బ్యాంక్..!

కేంద్రం ఇచ్చిన లేఖకు వెనక్కి తగ్గిన ప్రపంచ బ్యాంక్..!
 
ఇటీవల ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రి జగన్ అయినందువలన ప్రపంచ బ్యాంకు కూడా భయపడి పోయింది అందువల్లనే రాజధాని అమరావతి విషయంలో రుణాలు ఇవ్వడానికి వెనకడుగు వేసిందని తెలుగుదేశం పార్టీకి చెందిన ఒక వర్గపు మీడియా అలాగే సోషల్ మీడియాలో అనేక ఆరోపణలు జగన్ ప్రభుత్వంపై వేయడం జరిగింది. ఇటువంటి నేపథ్యంలో అమరావతి రాజధాని కి సంబంధించి రుణాలు ఆగింది కేవలం కేంద్ర ప్రభుత్వ సూచన మేరకేనని ప్రపంచ బ్యాంక్ స్పష్టత ఇచ్చింది. రుణ ప్రతిపాదన ఆపడానికి, ఎపి ప్రభుత్వానికి ఎలాంటి సంబందం లేదని కూడా బ్యాంక్ తెలిపింది.
 
రాజధాని ప్రాజెక్టుపై ముందుకు వెళ్లకపోయినా ఏపీలో కొత్త ప్రభుత్వానికి అవసరమైన సహాయం చేసేందుకు సిద్ధంగా ఉన్నామని ఉద్ఘాటించింది. ఈ మేరకు ప్రపంచ బ్యాంకు ప్రిన్సిపల్‌ కమ్యూనికేషన్‌ అధికారి సుదీప్‌ మొజుందర్‌ పేరిట ఆదివారం బ్యాంకు వెబ్‌సైట్‌లో పత్రికా ప్రకటన విడుదలైంది. ప్రపంచ బ్యాంకు ఏపీలో ఆరోగ్యం, వ్యవసాయం, ఇంధనం, విపత్తుల నిర్వహణ రంగాలను కవర్‌ చేసే ఒక బిలియన్‌ డాలర్ల ఆర్థిక సహాయ కార్యక్రమాన్ని కొనసాగిస్తుందని తెలిపారు. గత నెల 27వ తేదీన ఏపీ ప్రభుత్వంతో కుదుర్చుకున్న ఒప్పందం మేరకు ఆరోగ్య రంగంలో 328 మిలియన్‌ డాలర్ల కొత్త ఆర్థిక సహాయం కూడా ఇందులో కలిసి ఉంటుందని పేర్కొన్నారు. దీంతో ప్రపంచ బ్యాంకు అధికారులు క్లారిటీ ఇవ్వడంతో తెలుగుదేశం పార్టీ జగన్ పై చేస్తున్న ఆరోపణలకు చెంపపెట్టు లాగా అయింది.
Top