పార్టీలో చేరే వారికి కొత్త ఆఫర్ ఇచ్చిన బీజేపీ..?

Written By Siddhu Manchikanti | Updated: July 22, 2019 14:04 IST
పార్టీలో చేరే వారికి కొత్త ఆఫర్ ఇచ్చిన బీజేపీ..?

పార్టీలో చేరే వారికి కొత్త ఆఫర్ ఇచ్చిన బీజేపీ..?
 
రెండోసారి దేశ వ్యాప్తంగా భారీ మెజార్టీతో అధికారంలోకి వచ్చిన బీజేపీ తన పార్టీ కార్యకలాపాలను సౌత్ లో కూడా విస్తరింపజేయడానికి అన్ని రకాల ప్రయత్నాలు మొదలు పెట్టినట్లు ప్రస్తుత పరిణామాలను బట్టి తెలుస్తుంది. అయితే ప్రస్తుతం బీజేపీకి ఎదురీదుతున్న పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బిజెపి పార్టీ పై షాకింగ్ కామెంట్ చేసింది. దక్షిణాది భారతదేశంలో విస్తరించే క్రమంలో కర్ణాటకలో అనుసరిస్తున్న వైఖరినే పశ్చిమబెంగాల్ రాష్ట్రంలోనూ ప్రయోగించాలని బీజేపీ చూస్తోందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమత బెనర్జీ ఆరోపించారు.
 
ఒక బారీ బహిరంగ సభలో ఆమె మాట్లాడారు. దీనికోసం తమ ఎమ్మెల్యేలు ఒక్కొక్కరికి రూ.2 కోట్లతోపాటు పెట్రోల్‌ బంక్‌ ఇస్తామని పార్టీలో చేరే వారికి కొత్త ఆఫర్ ఇస్తూ ప్రలోభపెడుతోందని ఆరోపించారు. తమ పార్టీ గ్రామ నేతలకు రూ.20 లక్షలు ఇస్తామని ఆశ చూపుతోందన్నారు. డబ్బుతో ఎవరినైనా కొనేయగలమనే అహంకారంలో బీజేపీ ఉందని మండిపడ్డారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఈవీఎంలను మేనేజ్‌ చేసి బీజేపీ గెలిచిందని మమత ఆరోపించారు. ప్రస్తుత తీరుగానే వారి వ్యవహారం ఉంటే మరో రెండేళ్లే కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంటుందని హెచ్చరించారు.
Top