కలెక్టర్ లకి చుక్కలు చూపించిన జగన్..?

కలెక్టర్ లకి చుక్కలు చూపించిన జగన్..?

కలెక్టర్ లకి చుక్కలు చూపించిన జగన్..?
 
ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యాక వైసీపీ అధినేత జగన్ తన మార్క్ పాలన ప్రజలకు అందించడానికి అన్ని విధాలా కృషి చేస్తూ తనతోపాటు ఉన్న అధికారులను కలెక్టర్లను ఒకే తాటిపైకి తీసుకురావటానికి సామాన్యులకు న్యాయం చేయటానికి కృషి చేస్తున్న సీఎం జగన్ మొట్టమొదటి కలెక్టర్ల సమావేశంలో చాలా హుందాగా వ్యవహరించి అందరినీ ఆశ్చర్యపరచడం జరిగింది. తాజాగా ఇటీవల జరిగిన కలెక్టర్ల సమావేశంలో కోపంతో జగన్ కలెక్టర్ లకి చుక్కలు చూపించినట్లు సమాచారం. నవరత్నాల విషయంలో తాను చెప్పినట్టు చేయకుండా కలెక్టర్లు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో కలెక్టర్ల సమావేశంలో ఫైళ్లను విసిరికొట్టి జగన్ సమావేశం మధ్యలోనే వెళ్లిపోయినట్లు వార్తలు వినబడుతున్నాయి.
 
కారణం తాను చెప్పిన పని కలెక్టర్లు చేయకపోవటమే అని తెలుస్తుంది. పాదయాత్రలో, ఎన్నికల ప్రచారంలో ప్రజలకు ఎక్కువగా నవరత్నాలు హామీల విషయంలో జగన్ మాట ఇవ్వడం జరిగింది దీంతో ఎట్టి పరిస్థితుల్లో అయిన అమలు చేయాలనే ఒకే ఒక లక్ష్యంతో జగన్ పనిచేస్తున్నట్లు తెలుస్తుంది. అయితే వాటికి సరిపడినంత బడ్జెట్ అనేది అందుబాటులో లేకపోవడంతో కలెక్టర్లు కూడా ఏమీ చేయలేక జరిగిన సమావేశంలో జగన్ వేసిన ప్రశ్నలకు సమాధానాలను సరిగ్గా చెప్పకపోవటంతో జగన్ అసహనానికి గురవటంతో ఈ పరిణామం చోటు చేసుకుందని ఏపీ రాజకీయాల్లో వినబడుతున్న టాక్.Top