జగన్ అధికారంలో రావడం వల్లే రాజధాని భూముల రేట్లు తగ్గిపోయాయి అంటున్న చంద్రబాబు..!

Written By Siddhu Manchikanti | Updated: July 22, 2019 14:14 IST
జగన్ అధికారంలో రావడం వల్లే రాజధాని భూముల రేట్లు తగ్గిపోయాయి అంటున్న చంద్రబాబు..!

జగన్ అధికారంలో రావడం వల్లే రాజధాని భూముల రేట్లు తగ్గిపోయాయి అంటున్న చంద్రబాబు..!
 
ఆంధ్ర ప్రదేశ్ నవ్యాంధ్ర రాజధాని అమరావతి ప్రాంతంలో భూముల ధరలు పడిపోయాయని రియల్ ఎస్టేట్ దారుణంగా దెబ్బతిందని ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో ధ్వజమెత్తారు. దీనికి కారణం జగన్ అధికారంలోకి రావటమే అన్నట్టుగా బాబు వ్యాఖ్యానించారు. గతంలో గజం పాతికవేల నుంచి ముప్పైవేల రూపాయల వరకు ఉందని, ఇప్పుడు అది తగ్గిపోయాయని ఆయన అన్నారు.
 
ప్రపంచ బ్యాంక్ కు కొందరు పిర్యాదు చేశారని, వారు పరిశీలన చేశారని, రెండు నివేదికలు ఇచ్చారని ఆయన అన్నారు. వైఎస్ ఆర్ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత రేట్లు పడిపోయాయని చంద్రబాబు అన్నారు. రాజధానిలో తాము ఎక్కడా అవినీతి కి పాల్పడలేదని పేర్కొన్నారు. ప్రపంచ బ్యాంకు నివేదికపై కేంద్రానికి ఎపి ప్రభుత్వం సరైన నివేదిక పంపి ఉండాల్సిందని చంద్రబాబు ధ్వజమెత్తారు. ఒక ప్రాజెక్టుకు దర్యాప్తు వస్తే, అన్నిటికి వచ్చే అవకాశం ఉంటుందని, అందుకే కేంద్రం ప్రపంచ బ్యాంక్ రుణాన్ని తోసిపుచ్చిందని ఆయన అన్నారు. ఈ దుర్మార్గం మీదేనని చంద్రబాబు.. జగన్ ప్రభుత్వంపై విమర్శలు చేశారు.
Top