జగన్ మీద పిచ్చ కోపంగా ఉన్న కేంద్రం ?

జగన్ మీద పిచ్చ కోపంగా ఉన్న కేంద్రం ?

జగన్ మీద పిచ్చ కోపంగా ఉన్న కేంద్రం ?
 
ఒకపక్క అప్పులపాలైన రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన జగన్ చంద్రబాబు హయాంలో జరిగిన అవినీతి ని బయటకు తీయడానికి ప్రయత్నాలు చేస్తుంటే మరోపక్క భారీ మెజార్టీతో కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బిజెపి జగన్ ని కట్టడి చేయడానికి శతవిధాల ప్రయత్నాలు చేస్తున్నట్లు ప్రస్తుత పరిణామాలను బట్టి తెలుస్తోంది. ఆంధ్ర రాష్ట్రంలో జరిగిన ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ చిత్తు చిత్తుగా ఓడిపోవడంతో ప్రజలు తనకి భారీ మెజార్టీ ఇవ్వటంతో అవినీతిలేని ప్రభుత్వాన్ని సామాన్యులకు ఇవ్వడానికి జగన్ అన్ని రకాలుగా ప్రభుత్వ అధికారులను కలెక్టర్లను ఒకతాటిపైకి తీసుకొస్తూనే మరోపక్క గత ప్రభుత్వం చంద్రబాబు హయాంలో జరిగిన అవినీతిని కూడా బయటకు తీస్తున్నారు.
 
ఈ క్రమంలో రాష్ట్రానికి వేలాది కోట్ల మేర నష్టాన్ని తెచ్చిపెడుతున్న విద్యుత్ కొనుగోలు ఒప్పందా(పీపీఏ)లను పున:సమీక్షిస్తానంటూ జగన్ రంగంలోకి దిగితే... మోదీ సర్కారు ఆదిలోనే అడ్డుపుల్ల వేసిన సంగతి తెలిసిందే. పీపీఏల పున:సమీక్షతో పెట్టుబడులు నిలిచిపోయే ప్రమాదం ఉందన్న సాకుతో జగన్ తన నిర్ణయాన్ని మార్చుకోవాలని ఇప్పటికే కేంద్రం రెండు లేఖలు రాసింది. అయినా కూడా తాను చెప్పిన మాటకు కట్టుబడ్డ జగన్... పీపీఏల పున:సమీక్షకే మొగ్గు చూపగా... ఇప్పుడు కేంద్రం ఆయనకు భారీ షాకే ఇచ్చింది. పీపీఏల పున:సమీక్షకు రావాలంటూ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలైన ఎన్టీపీసీ - ఎస్ ఈసీఐలకు జగన్ సర్కారు లేఖలు రాసింది. ఈ లేఖలను చూసిన ఆ రెండు సంస్థలు సమీక్షకు తాము రాలేమని చెబుతూనే... తమకు చెల్లించాల్సిన బకాయిలను తక్షణమే చెల్లించాలంటూ ఏకంగా నోటీసులు జారీ చేసి జగన్ సర్కారుకు షాకిచ్చాయి. మొత్తం మీద ప్రజలకు ఇచ్చిన మాటపై మొండిగా వ్యవహరిస్తున్న జగన్ వ్యవహారంపై కేంద్రం చాలా సీరియస్ గా ఉన్నట్లు సమాచారం.


Tags :


Top