పాపం కన్నా ని ఆడుకుంటున్నారు!

Written By Siddhu Manchikanti | Updated: July 25, 2019 15:27 IST
పాపం కన్నా ని ఆడుకుంటున్నారు!

పాపం కన్నా ని ఆడుకుంటున్నారు!
 
ఏపీ బీజేపీలో అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ పరిస్థితి ఆటలో అరటిపండు గా మారిపోయింది. రెండు తెలుగు రాష్ట్రాలలో బలపడాలని చూస్తున్న బీజేపీ పార్టీ రాష్ట్రంలో ఉన్న బీజేపీ నేతలకు తెలియకుండా అనుసరిస్తున్న వైఖరి రాష్ట్రంలో ఉన్న బిజెపి పార్టీ నాయకులకు తికమక కు గురిచేస్తున్నట్లు ప్రస్తుత పరిణామాలను బట్టి తెలుస్తుంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇతర పార్టీలకు చెందిన నాయకులను బిజెపి పార్టీ లో చేర్పించే క్రమంలో చేపడుతున్న ఆపరేషన్ ఆకర్ష్ కార్యక్రమంలో కనీసం రాష్ట్ర బిజెపి పార్టీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ కె సరైన గౌరవం దక్కకపోవడంతో ఏపీలో బిజెపి పార్టీ లో ఉన్న నేతలు కన్నా లక్ష్మీనారాయణ పరిస్థితి చూసి పాపం అన్నట్టుగా కామెంట్లు చేస్తున్నారు.
 
పార్టీ అధ్యక్షుడిగా కన్నా లక్ష్మినారాయణ వ్యవహరిస్తున్న కానీ ఇతర పార్టీలకు చెందిన నాయకులు బిజెపి లో చేరుతున్న సమయంలో ముఖ్యమైన నాయకులుగా జివిఎల్, రామ్ మాధవ్ వ్యవహరించడంతో కన్నా లక్ష్మీనారాయణ ఏ పార్టీలో నామ్ కే వాస్త అన్నట్లుగా మారిపోయింది. మరోపక్క పురందేశ్వరి కూడా పార్టీలో కీలకంగా మారుతున్న క్రమంలో కన్నా లక్ష్మీనారాయణ గౌరవం రోజురోజుకీ బీజేపీ పార్టీలో తగ్గిపోతున్న నేపథ్యంలో... కన్నా లక్ష్మీనారాయణ పరిస్థితి చూసి చాలామంది బిజెపి నేతలు పాపం అన్నట్టుగా చర్చించుకుంటున్నారు.
Top