జగన్ కేసులపై దిమ్మతిరిగిపోయే కామెంట్స్ చేసిన ఏపీ బీజేపీ నేత…!

Written By Siddhu Manchikanti | Updated: July 28, 2019 16:51 IST
జగన్ కేసులపై దిమ్మతిరిగిపోయే కామెంట్స్ చేసిన ఏపీ బీజేపీ నేత…!

జగన్ కేసులపై దిమ్మతిరిగిపోయే కామెంట్స్ చేసిన ఏపీ బీజేపీ నేత…!
 
2014 ఎన్నికల్లో కేంద్రంలో బిజెపి ఇటు రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఉన్న సమయం లో ఎప్పుడు ఎక్కడ కూడా జగన్ కేసుల ప్రస్తావన తీసుకురాలేదు ఏపీ బీజేపీ నేతలు అడవి కేంద్రంలో ఉన్న పెద్దలు. గతంలోనే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నసమయంలో కావాలని కాంగ్రెస్ పార్టీ జగన్ ని తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తుందని బిజెపి పార్టీకి చెందిన నాయకులే పార్లమెంటులో కామెంట్లు చేసిన సందర్భాలు ఉన్నాయి. ఇటువంటి నేపథ్యంలో 2019 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలోకి జగన్ భారీ మెజార్టీతో రావడం మరో పక్క కేంద్రంలో కూడా బిజెపి 2014 కంటే ఎక్కువ మెజారిటీతో రెండోసారి అధికారంలోకి రావడంతో ఎన్నడూ లేని విధంగా జగన్ను కట్టడి చేయడానికి సరికొత్త ప్రయత్నాలు చేస్తున్నట్లు ప్రస్తుత పరిణామాలను బట్టి తెలుస్తుంది. ఈ క్రమంలో ఏపీ బీజేపీ ఇంచార్జ్ సునీల్ దేవోదర్ మాట్లాడుతూ...బీజేపీ పార్టీలో చేరినంత మాత్రానో లేదా మోడీతో సానుకూలంగా స్పందిస్తున్నారన్న వంక తోనో అవినీతి ముద్ర ఉన్నటువంటి ఏ నాయకులను కూడా బీజేపీ ఉపేక్షించదని దానికి తాజాగా బీజేపీలో చేరిన సుజనా మరియు సీఎం రమేష్ లు కూడా అతీతం కారని అంటూ ఎన్నో అవినీతి కేసుల్లో ఇరుక్కున్న జగన్ ఇప్పుడు ముఖ్యమంత్రి అయినంత మాత్రాన జగన్ పై విచారణలు ఆగవని చట్టం తన పని తాను చేసుకుపోతుందని బాంబు పేల్చారు. దీంతో ఇప్పుడు బీజేపీ ఏపీ కో ఇంచార్జ్ సునీల్ దేవోదర్ చేసిన కామెంట్లు వైసీపీ పార్టీలో కలకలం రేపుతున్నాయి.
Top