కమెడియన్ అలీని సీరియస్ గా తీసుకోబోతున్న జగన్..!

Written By Siddhu Manchikanti | Updated: July 29, 2019 15:15 IST
కమెడియన్ అలీని సీరియస్ గా తీసుకోబోతున్న జగన్..!

కమెడియన్ అలీని సీరియస్ గా తీసుకోబోతున్న జగన్..!
 
తన కష్టాలలో మరియు ఇబ్బందికరమైన పరిస్థితులలో తన వెంటే ఉన్నవారిని ఎప్పుడు గుర్తుపెట్టుకొని నాయకుడు ఆంధ్ర రాజకీయాల్లో ఉన్నారంటే అది వైయస్ జగన్ అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. గత పది సంవత్సరాలు తన కష్టాలలో ఉన్న ప్రతి ఒక్కరికి ఇప్పుడు ఏదో ఒక విధంగా తన వారిని పైకి తీసుకువస్తూ మరోపక్క తనకి భారీ మెజార్టీతో అధికారం ఇచ్చిన ఆంధ్ర ప్రజలకు అవినీతి లేని పాలన మరియు అదిరిపోయే సంక్షేమ కార్యక్రమాలు అప్పుల ఊబిలో ఉన్న ఆంధ్రరాష్ట్రంలో ఇవ్వటానికి బాగానే కష్టపడుతున్నారు ఏపీ సీఎం జగన్.
 
ముఖ్యంగా తాను చేస్తున్న పాదయాత్ర సమయంలో ఎన్నికల ప్రచారంలో టాలీవుడ్ ఇండస్ట్రీ కమెడియన్ ఆలీ తనకు వెన్నంటే ఉండి వైసిపి పార్టీ కి మద్దతుగా ప్రచారం చేసిన నేపథ్యంలో ప్రస్తుతం కమెడియన్ అలీ ని సీరియస్ గా రాజకీయంగా పైకి తీసుకురావడానికి జగన్ అన్ని విధాలా ఆలోచిస్తున్నట్లు వైసీపీ పార్టీ లో వినపడుతున్న టాక్. ముఖ్యంగా టాలీవుడ్ ఇండస్ట్రీ థర్టీ ఇయర్స్ పృథ్వి జగన్ కి మొట్ట మొదటి నుండి మద్దతు తెలుపుతున్న క్రమంలో ఇటీవల పృథ్వి కి ఎస్వీబీసీ చైర్మన్ గా నియమించారు. ఇటువంటి నేపథ్యంలో ఇప్పుడు తాజాగా కమెడియన్ ఆలీ కి ఆంధ్రప్రదేశ్ చలనచిత్ర నాటక మండలి చైర్మన్ (ఎఫ్.డీ.సీ) చైర్మన్ పదవిని జగన్ ఖాయం చేశారన్న ప్రచారం జరుగుతోంది. త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేయనున్నట్లు వార్తలు వినపడుతున్నాయి.
Top