రాజకీయాల్లోకి వస్తా మీ అందరి అంతు చూస్తా..!

Written By Siddhu Manchikanti | Updated: July 29, 2019 15:18 IST
రాజకీయాల్లోకి వస్తా మీ అందరి అంతు చూస్తా..!

రాజకీయాల్లోకి వస్తా మీ అందరి అంతు చూస్తా..!
 
ఆపరేషన్ గరుడ ఎపిసోడ్ తో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన నటుడు శివాజీ.. టీవీ9 రవి ప్రకాష్ తో ఫోర్జరీ కేసులతో ఇటీవల వార్తల్లో బాగా నిలిచారు. ఇటువంటి నేపథ్యంలో తాజాగా శివాజీ రాజకీయాల్లోకి వస్తాను రాష్ట్రంలో ఉన్న అవినీతిపరుల అంత చూస్తాను అంటూ ఇటీవల ఓ టీవీ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో భారీ డైలాగులు వేశారు. అంతేకాకుండా టీవీ9 కేసుల గురించి రవి ప్రకాష్ గురించి షాకింగ్ కామెంట్లు చేశారు. శివాజీ ఏమన్నారంటే టీవీ9 షేర్ల వివాదాన్ని… శివాజీ చాలా చిన్న విషయంగా తేల్చేశారు. రవిప్రకాష్ అసలు తనకు వాలంటరీగా షేర్లు ఇచ్చారని.. కానీ తనకు.. ఉచితంగా తీసుకోవడం ఇష్టం లేకనే.. రూ. ఇరవై లక్షలు ఇచ్చానని చెప్పుకొచ్చారు. ఆ తర్వాత యాజమాన్యం చేతులు మారే సమయంలో కూడా.. తనకు సరైన సమాచారం ఇవ్వలేదన్నారు. టీవీ9 కొనుగోలు చేసిన అలంద మీడియా మొత్తం ప్రక్రియను… న్యాయబద్దంగా చేయలేదని… రవిప్రకాష్‌తో.. మేఘా కృష్ణారెడ్డి స్నేహం నటించి మోసం చేశారని… విమర్శించారు.అంతేకాకుండా తనకు కులపిచ్చి లేదని నిజంగా కులాన్ని అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేస్తే చంద్రబాబు కంటే పెద్ద రాజకీయ నేత అయ్యేవాడిని శివాజీ చెప్పుకొచ్చారు.
 
త్వరలోనే రాజకీయాల్లోకి వస్తానని ఏ పార్టీలో చేరేది మరి కొద్ది రోజుల్లో ప్రకటిస్తామని కచ్చితంగా తెలుగుదేశం మరియు వైసీపీ పార్టీలో చేరే ఆలోచన లేదన్నట్టుగా ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చారు శివాజీ. అదేవిధంగా దేశంలో జమిలి ఎన్నికలు వస్తే ఇంకా ప్రాంతీయ పార్టీల అడ్రస్ గల్లంతు అయిపోతాయని కాబట్టి త్వరలోనే జాతీయ పార్టీలో చేరుతున్నట్లు శివాజీ మాట్లాడుతూ తనని ఇన్ని విధాలుగా ఇబ్బందులపాలు చేశారో వారందరికీ సినిమా చూపిస్తామని రాజకీయాల్లోకి వస్తానంటూ షాకింగ్ కామెంట్ చేశారు.
Top