వచ్చి మా డ్రెస్సింగ్ రూముల్లోకి తొంగి చూడండి - కొహ్లీ

Written By Siddhu Manchikanti | Updated: July 30, 2019 14:27 IST
వచ్చి మా డ్రెస్సింగ్ రూముల్లోకి తొంగి చూడండి - కొహ్లీ

వచ్చి మా డ్రెస్సింగ్ రూముల్లోకి తొంగి చూడండి - కొహ్లీ
 
ప్రపంచ కప్ సెమీ ఫైనల్లో ఇండియా టీమ్ ఓడిపోవడంతో కెప్టెన్సీ కోహ్లీపై అలాగే ప్లేయర్ రోహిత్ శర్మ పై ఇటీవల ఎలక్ట్రానిక్ మీడియాలో సోషల్ మీడియాలో వరుసగా కథనాలు వస్తున్నా దానిపై జరుగుతున్న ప్రచారంపై తాజాగా కెప్టెన్ కోహ్లి స్పందించారు. వెస్టిండీస్ టూర్ కు బయల్దేరేముందు కోచ్ రవిశాస్త్రితో కలిసి డియా సమావేశంలో మాట్లాడిన కోహ్లీ.. రోహిత్ శర్మ కారణంగా తన కెప్టెన్సీకి ఎసరు వస్తుందని తాను ఎప్పుడూ భావించలేదని - ఒకవేళ రోహిత్ ను చూసి అభద్రతా భావానికి లోనైతే అది తన ముఖంలో ప్రతిఫలిస్తుందని వివరించాడు. రోహిత్ శర్మ ఆటకు తాను అభిమానినని కోహ్లీ చెప్పుకొచ్చాడు.
 
క్రికెట్ పై దృష్టిపెట్టాల్సిన సమయంలో లేని వివాదాన్ని రేకెత్తిస్తున్నారని - ఈ విషయమై మీడియా ఆలోచించాలని విజ్ఞప్తి చేశాడు. ముఖ్యంగా ప్రపంచ కప్ మ్యాచ్ సమయంలో రాయుడిని ఎంపిక చేయకపోవడం.. ధోనీని ముందు బ్యాటింగుకు పంపించకపోవడం వంటి విషయాల్లో ఇద్దరి మధ్య విభేదాలున్నాయి కథనాలొచ్చాయి. అనంతరం రోహిత్ శర్మ రీసెంటుగా కోహ్లీ - ఆయన భార్య అనుష్క శర్మ లను ఇన్ స్టాగ్రామ్ లో అన్ ఫాలో చేయడం ఈ అనుమానాలకు మరింత ఊతమిచ్చింది. అయితే.. వీటన్నిటికీ తెర దించుతూ కోహ్లీ క్లారిటీ ఇవ్వడం జరిగింది. తమ మధ్య విభేదాలు గొడవలు ఏమీ లేవని అవసరమైతే పిచ్చి పిచ్చి రాతలు రాసే వారు వచ్చి మా డ్రెస్సింగ్ రూం లోకి తొంగి చూడండి అన్నట్టుగా కోహ్లీ ఈ సమావేశంలో చాలా ఘాటుగా వచ్చిన వార్తలపై స్పందించడం జరిగింది.
Top