ఇదీ హిట్ అయితే మరో ఇరవైయ్యేళ్లు జగనే సీఎం.. వారెవ్వా ఏం ప్లాన్…!

ఇదీ హిట్ అయితే మరో ఇరవైయ్యేళ్లు జగనే సీఎం.. వారెవ్వా ఏం ప్లాన్…!

ఇదీ హిట్ అయితే మరో ఇరవైయ్యేళ్లు జగనే సీఎం.. వారెవ్వా ఏం ప్లాన్…!
 
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సీఎం వైసిపి పార్టీ అధ్యక్షుడు జగన్ త్వరలో అదిరిపోయే ప్లాన్ తో భవిష్యత్తు రాజకీయాలు చేయబోతున్నారు. దివంగత వైయస్ రాజశేఖరరెడ్డి చనిపోయిన తర్వాత జగన్ పొలిటికల్ జర్నీ చూస్తే ఆయన ఎప్పుడు నిత్యం ప్రజల్లోనే ఉంటూ తన పార్టీకి సంబంధించిన నాయకులకు అంతగా పెద్దగా ప్రాధాన్యత ఇవ్వలేదు. ఇందుమూలంగా ఎప్పుడూ కూడా జగన్ తన ప్రసంగం లో నేను ప్రజలని దేవుని నమ్ముకుని రాజకీయాలు చేస్తానని చెప్పిన సందర్భాలు చాలానే ఉన్నాయి. అయితే తాజాగా ముఖ్యమంత్రి అయ్యాక జగన్ త్వరలోనే మళ్లీ గతంలో లాగానే ప్రజలలో ఉండే విధంగా ఒక టూర్ ప్లాన్ చేసినట్లు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వినబడుతున్న టాక్. ఈ పర్యటనలో భాగంగా ఇకపై ప్రతీ జిల్లాలో పర్యటించాలన్నది జగన్ తాజా ఆలోచనగా తెలుస్తోంది.
 
జగన్ అధికారం చేపట్టిన తరువాత ఇప్పటివరకు ఒక్క కడప జిల్లాకు తప్ప ఎక్కడా పర్యటించలేదు. అందుకే ఇప్పుడు మిగతా అన్ని జిల్లాల్లో పర్యటించి ప్రజలను నేరుగా కలుసుకుని వారి వారి సమస్యలను తెలుసుకుని మరింత మెరుగైన పరిపాలన అందించాలని జగన్ చూస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వ అధికారులకు ఈ టూర్ కి సంబంధించి ప్లాన్ వేస్తున్నారు. ఆగస్ట్ 1 నుంచి 4 వరకూ విదేశీ పర్యటనలో భాగంగా జెరూసలం కుటుంబంతో సహా వెళ్తున్న జగన్ ఆగస్ట్ 16 నుంది 22 వరకూ అమెరికా పర్యటనకు షెడ్యూల్ రూపొందించుకున్నాడు. ఈ రెండు పర్యటనల తరువాత జిల్లాల టూర్లకు జగన్ సిద్ధమయ్యేందుకు చూస్తున్నాడు. ఈ నేపథ్యంలో వెనుకబడిన జిల్లా మరియు రాజకీయాలకు సెంటిమెంట్గా భావించే శ్రీకాకుళం జిల్లా నుండి జగన్ ఈ పర్యటన చేయబోతున్నట్లు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వినబడుతున్న టాక్. దీంతో ఈ టూర్ సక్సెస్ అయితే కచ్చితంగా రాబోయే 20 సంవత్సరాలు జగనే సీఎం ఇది కన్ఫామ్ అని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.Top