మళ్లీ ఎన్నికలకు సిధం అవుతున్న ఏపీ, తెలంగాణా..?

Written By Siddhu Manchikanti | Updated: August 02, 2019 18:35 IST
మళ్లీ ఎన్నికలకు సిధం అవుతున్న ఏపీ, తెలంగాణా..?

మళ్లీ ఎన్నికలకు సిధం అవుతున్న ఏపీ, తెలంగాణా..?
 
ఇటీవలే రెండు తెలుగు రాష్ట్రాలలో ఎన్నికలు ముగిశాయి. ఆంధ్ర రాష్ట్రంలో అసెంబ్లీ పార్లమెంటు స్థానాలకు సార్వత్రిక ఎన్నికలు జరగగా తెలంగాణ రాష్ట్రంలో పార్లమెంటు ఎన్నికలు జరగటం మనం చూశాం. ఇటువంటి తరుణంలో మరొకసారి రెండు తెలుగు రాష్ట్రాలు ఎన్నికలకు సిద్ధం అవుతున్నట్లు రాజకీయాల్లో వినపడుతున్న టాక్. ఖాళీగా రెండు తెలుగు రాష్ట్రాలలో ఉన్న ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించడానికి తాజాగా ఈ సి కసరత్తులు చేస్తున్నట్లు వార్తలు వినబడుతున్నాయి. అంతేకాకుండా ఈ ఎన్నికల నిర్వహణకు తాజాగా ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ కూడా విడుదల చేసినట్లు సమాచారం. దీంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మూడు స్థానాలకు ఎన్నికల నిర్వహిస్తుండగా తెలంగాణలో ఒక ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నికలు నిర్వహించబోతున్నారు. అయితే ఈ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ ఈ నెల 7వ తేదిన విడుదల కాబోతుంది. ఈ నెల 14వ తేది వరకు నామినేషన్ల దాఖలకు అనుమతులు ఇవ్వగా, 16వ తేదిన నామినేషన్ల పరిశీలన జరుపుతారు. అయితే ఈ నెల 19వ తేది వరకు ఉపసంహరణకు అనుమతులు ఇవ్వగా, 26 వ తేదిన ఎన్నికలు నిర్వహించబోతున్నారు. అయితే వీటి ఓట్ల లెక్కింపు కూడా ఎన్నికల రోజే నిర్వహించి ఫలితాన్ని సాయంత్రంలోపు ప్రకటిస్తారు. అయితే తెలంగాణలో యాదవరెడ్డి అనర్హత వేటు వలన ఉప ఎన్నికలు నిర్వహిస్తుండగా, ఏపీలో కరణం బలరామకృష్ణమూర్తి, వీరభద్రస్వామి, కృష్ణ శ్రీనివాస్ లు రాజీనామా చేసిన స్థానాలలో ఎన్నికలు జరగబోతున్నట్లు సమాచారం.
Top