పవన్! నువ్విలా మాట్లాడడం భావ్యమా?

పవన్! నువ్విలా మాట్లాడడం భావ్యమా?

పవన్! నువ్విలా మాట్లాడడం భావ్యమా?
 
నేను అంతా కరెక్ట్ గానే చేశాను... జరిగిన ఎన్నికలలో జనసేన పార్టీ ఓటమికి కారణం నాయకులు కార్యకర్తలు అన్నట్టుగా ఇటీవల పవన్ కళ్యాణ్ సమీక్షా సమావేశాల్లో మాట్లాడటం పట్ల పవన్ కళ్యాణ్ అభిమానులకు జనసేన కార్యకర్తలకు పవన్ కళ్యాణ్ ఇలా మాట్లాడటం భావ్యమా అంటున్నారు. జరిగిన ఎన్నికలలో ప్రజల్లోకి తమను వెళ్లకపోవడానికికారణం అభిమానులని వైసీపీ అధినేత జగన్ లాగా కష్టపడటానికి తాను సిద్ధమేనని ఒకవేళ నేను రోడ్డుపైకి వస్తే అభిమానులు తనను మాంసం ముద్దగా చేస్తారు ముక్కలు ముక్కలు చేస్తారు పీకేస్తారు అని పేర్కొన్నారు. చాలా చోట్ల చాలా మంది పార్టీకి చెందిన నాయకులు అభిమానులు తనకి ఈ విధంగా సహకరిస్తున్నారని పవన్ ఇటీవల సమావేశంలో పేర్కొన్నారు. అదేమిటంటే ‘‘పవన్ కళ్యాణ్ రోడ్ల మీద తిరిగితే పార్టీ బలపడుతుందని సలహాలు ఇస్తున్నారు. ప్రధాని మోడీ, చంద్రబాబు, లోకేశ్ రోడ్లు మీద తిరుగరు. జగన్మోహన్ రెడ్డి మీద కేసులు లేకపోతే జనంలో తిరిగేవారు కాదు. ఇంట్లో కూర్చొనే రాజకీయాలు చేస్తారు. ఆయన రోడ్లు మీద తిరగడం ఆ రోజుకు అవసరం. వైఎస్ రాజశేఖర్ రెడ్డి చనిపోయిన తర్వాత జగన్ ను సీఎం చేయాలని నాడు ఎక్కువ మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోరుకున్నారు. కానీ అలా జరగలేదు కనుకే జగన్ రోడ్లపై తిరిగి కష్టపడ్డారని, ఆ కష్టాన్ని తానేమీ కాదనడం లేదు. నేను కూడా రోడ్లపై తిరిగేందుకు సిద్ధంగా ఉన్నాను. కానీ, అభిమానులు నన్ను తిరగనిస్తారా?’. నా చొక్కానే కాదు, నా శరీరాన్నీ ముక్కలు ముక్కలుగా అభిమానులు పీక్కుపోతారు. వచ్చే ప్రజలను, అభిమానులను అదుపు చేయలేక నా సెక్యూరిటీ అలసిపోతారు. రోడ్లపైకి నేను రావాలంటే ఇన్ని ఆలోచించాలి. అలా అని నేను రాకుండా ఉండను కచ్చితంగా వస్తాను’’ అని పవన్ వ్యాఖ్యానించారు. దీంతో పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల పట్ల జనసేన పార్టీలో ఉన్న నాయకులు కార్యకర్తలు అసహనం చెందుతున్నారు. ఎప్పుడు ఏ విధంగా ఎవరితో ప్రతి స్పందిస్తారో తెలియదు పార్టీ స్టాండ్ ఏ క్షణాన ఎలా ఉంటుందో తెలియదు...వైఫల్యాన్ని తన దగ్గర పెట్టుకుని మాపైన ఈ విధంగా పవన్ కళ్యాణ్ మాట్లాడటం భావ్యం కాదని పార్టీకి చెందినవారే అంటున్నారు.Top