డివైడ్ అవుతున్న అమెరికా..?

Written By Siddhu Manchikanti | Updated: August 05, 2019 13:43 IST
డివైడ్ అవుతున్న అమెరికా..?

డివైడ్ అవుతున్న అమెరికా..?
 
ఒకపక్క అరబ్ దేశాలలో శాంతి స్థాపన అంటూ ఇరాన్ తో కయ్యానికి రెడీ అవుతూ దూకుడు నిర్ణయాలు తీసుకుంటూ ప్రపంచ దేశాలను గడగడలాడిస్తుంది అగ్రరాజ్యం అమెరికా. ఇటువంటి నేపథ్యంలో అమెరికాలోనే కొంతమంది ఆ దేశానికి చెందిన వాళ్లే అమెరికానే డివైడ్ చేయాలి అంటూ కొత్త వాదన తెరపైకి తెస్తున్నారు. ఇటీవల అమెరికాను విభజించాలంటూ టెక్సాస్ లో కాల్పులు జరిపిన నిందితుడు ఒక వీడియో లో డిమాండ్ చేశాడట. దాని ప్రకారం.. వర్ణం ఆధారంగా అమెరికాను విభజించాలని.. తెల్లవారి స్థానంలో బయటి వ్యక్తులు అవకాశాలు తన్నుకుపోతున్నారని ఉన్మాది ఆగ్రహం వ్యక్తం చేశాడని న్యూయార్క్ టైమ్స్ వెల్లడించింది.51 మంది ప్రాణాలు బలిగొన్న న్యూజిలాండ్‌ క్రైస్ట్‌ చర్చ్‌ ఉన్మాదిని క్రూజియాజ్‌ ప్రశంసించాడు. అతని స్పూర్తిగానే కాల్పులకు తెగబడుటున్నట్టు చెప్పాడు. వర్ణ సంకరణం అమెరికా జన్యు విధానాన్ని నాశనం చేస్తోందని ‘ది ఇన్‌కన్వినెంట్‌ ట్రూత్‌’ పేరుతో అతను విడుదల చేసిన వర్ణ వివక్ష మేనిఫెస్టోపై విచారణ చేస్తున్నామని పోలీసులు తెలిపారు. ఈ కాల్పులలో ఇరవై మంది చనిపోయిన సంగతి తెలిసిందే.
Top