హౌస్ అరెస్ట్ అయిన మాజీ ముఖ్యమంత్రులు..!

Written By Siddhu Manchikanti | Updated: August 05, 2019 13:45 IST
 హౌస్ అరెస్ట్ అయిన మాజీ ముఖ్యమంత్రులు..!

హౌస్ అరెస్ట్ అయిన మాజీ ముఖ్యమంత్రులు..!
 
2014 ఎన్నికల సమయంలో మోడీతో ఎన్నికల వ్యూహాలు వేసిన అమిత్ షా తాజాగా 2019 ఎన్నికల్లో బిజెపి బంపర్ మెజారిటీతో అధికారంలోకి రావడంతో కేంద్ర మంత్రివర్గంలో కీలక శాఖ హోం మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఇటువంటి నేపథ్యంలో దేశంలో పాకిస్తాన్ భారత్ దేశాల మధ్య నలిగిపోతున్న జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంపై ప్రత్యేకమైన శ్రద్ధ ఇటీవల బిజెపి తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం కాశ్మీర్ లో ఉన్న వాతావరణం చూస్తుంటే యుద్ధ వాతావరణాన్ని తలపిస్తుంది. దీంతో జమ్ము-కశ్మీర్ పై కేంద్రం ఏదో తీవ్ర నిర్ణయం తీసుకునే సూచనలు కనిపిస్తున్నాయి.అనేక ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్న కేంద్రం తాజాగా మాజీ ముఖ్యమంత్రులు ఒమర్ అబ్దుల్లా, మెహబూబా ముప్తిలను గృహనిర్భందంలోకి తీసుకున్నట్లు సమాచారం.వారిని ఇల్లు దాటనివ్వబోమని అదికారులు చెబుతున్నారు. శ్రీనగర్ లో 144 వ సెక్షన్ విధించారు.
 
శాంతంగా ఉండాలని ప్రజలకు ఓ ట్వీట్‌ ద్వారా ఒమర్‌ విజ్ఞప్తి చేశారు. ‘రేపు ఏం జరగబోతోందో దేవుడికే తెలియాలి. ఈ రాత్రి సుదీర్ఘంగా ఉండబోతోంది’ అని మెహబూబా ట్వీట్‌ చేశారు. జమ్మూకశ్మీర్‌ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ, కశ్మీర్‌ ఐజీలతో గవర్నర్‌ సత్యపాల్‌ మాలిక్‌ ఆదివారం అర్ధరాత్రి ప్రత్యేక సమావేశం నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని విద్యాసంస్థలను సోమవారం మూసివేస్తున్నట్లు అధికారులు తెలిపారు.
Top