తన ఓటమిపై హేళన చేస్తున్న వారి కి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన పవన్..!

తన ఓటమిపై హేళన చేస్తున్న వారి కి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన పవన్..!

తన ఓటమిపై హేళన చేస్తున్న వారి కి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన పవన్..!
 
తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ రెండు చోట్ల ఓడిపోవడం జరిగింది. ఇటువంటి నేపథ్యంలో తన పార్టీకి సంబంధించిన నాయకులతో కార్యకర్తలతో సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా ఇటీవల తాను ఓడిపోయిన నియోజకవర్గం పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం నియోజకవర్గంలో పర్యటించి పార్టీ గురించి భవిష్యత్తు గురించి తన ఓటమిపై హేళన చేస్తున్న వారికి దిశానిర్దేశం చేస్తూ వార్నింగ్ కూడా ఇచ్చారు. ఈ సందర్భంగా భీమవరం నియోజకవర్గంలో కార్యకర్తలతో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ “ఎలాగైనా సరే నేనే గెలవాలి అనుకుని ఉంటే ప్రజారాజ్యం నుంచి పోటీ చేసేవాడిని, లేదా 2014 లో మాకు ఇన్ని ఎంపీలు కావాలి, ఇన్ని ఎమ్మెల్యేలు కావాలి అని అడిగి తీసుకునేవాడిని, కానీ నేను అలా అవకాశవాద రాజకీయం చేయలేదు” అని అలాగే “ఓడిపోయాక కాదు ఓడించబడిన నేల మీద నుంచి చెబుతున్నాను జనసేన పార్టీని ఒక నలుగురు వచ్చి నా శవం మోసుకెళ్లే వరకు మోస్తాను అని మాట ఇస్తున్నాను” అని వ్యాఖ్యానించారు. అంతేకాకుండా ప్రయాణం అన్నాక ఓటములే కాదు విజయాలు కూడా ఉంటాయని తన సినీ జీవితాన్ని ఉదాహరణగా చెప్తూ తన ఓటమిని చూసి నవ్వే వాళ్ళకి గట్టి కౌంటరే ఇచ్చారు.”వరుసగా అపజయాలు వచ్చాయని సినిమాలు ఆపేసి ఉంటే గబ్బర్ సింగ్ వచ్చేది కాదు” అని ఇప్పుడు ఓడినంత మాత్రాన తన గెలుపు ఆగిపోయినట్టు కాదు ఇప్పుడు తన ఓటమిని చూసి నవ్విన వారే ఓర్వలేని రోజు తప్పక వస్తుంది అని ధీమాగా పవన్ చెప్పారు.Top