వాషింగ్టన్ లో అదరగొట్టిన జగన్ స్పీచ్..!

Written By Siddhu Manchikanti | Updated: August 17, 2019 12:13 IST
వాషింగ్టన్ లో అదరగొట్టిన జగన్ స్పీచ్..!

వాషింగ్టన్ లో అదరగొట్టిన జగన్ స్పీచ్..!

 
తాజాగా ఇటీవల మొదటివి దేశ పర్యటన ఇజ్రాయిల్ దేశం తర్వాత అమెరికా పర్యటన చేపట్టిన జగన్ అక్కడ ప్రవాసాంధ్రుల ఉద్దేశించి అదరగొట్టే స్పీచ్ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తమ ప్రభుత్వం అవినీతి రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దడానికి అన్ని విధాలా కృషి చేస్తున్నామని పారదర్శకమైన పాలన ప్రజలకు అందించడానికి కృషి చేస్తున్నట్లు పేర్కొని రాష్ట్రంలో పెట్టుబడులు పరిశ్రమలు ఏర్పాటు చేసే వారికి అన్ని సదుపాయాలు కల్పిస్తున్నట్లు ముఖ్యమంత్రి జగన్ పేర్కొన్నారు. ఇంకా ఆయన మాట్లాడుతూ తమ రాష్ట్రంలో ఎవరైనా పరిశ్రమలు పెట్టాలనుకుంటే కేవలం ఒకే ఒక్క దరఖాస్తు నింపితే సరిపోతుందని, తన కార్యాలయమే దగ్గరుండి అన్ని పనులూ చూసుకుంటుందని స్పష్టం చేశారు. ఇన్వెస్ట్‌మెంట్‌ ప్రమోషన్‌ అండ్‌ మానిటరింగ్‌ అథారిటీ (ఇప్మా) పారిశ్రామికవేత్తలకు, పెట్టుబడిదారులకు చేదోడువాదోడుగా ఉంటుందని అన్నారు. వారికి చేయూతనిచ్చి నడిపించడమే కాకుండా.. పరిశ్రమలకు అవసరమైన భూములు, విద్యుత్, నీరు సమకూర్చిపెడుతుందని వివరించారు. అమెరికా రాజధాని వాషింగ్టన్‌ (డీసీ)లో యూఎస్‌ చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్‌కు విశాల సముద్ర తీరం ఉందని, కొత్తగా పోర్టులు నిర్మిస్తున్నామని, వీటిలో పాలుపంచుకోవాలని పిలుపునిచ్చారు. ఉప్పునీటిని మంచినీరుగా మార్చడం, మెట్రో రైళ్లు, బకింగ్‌హామ్‌ కెనాల్‌ పునరుద్ధరణ, ఎలక్ట్రికల్‌ బస్సులు, వ్యవసాయ స్థిరీకరణ, నదుల అనుసంధానం, వ్యవసాయ రంగంలో పరిశోధనలు, వ్యవసాయ ఉత్పత్తులకు మార్కెటింగ్‌ విస్తరణ, ఆక్వా ఉత్పత్తుల విస్తృతికి మార్కెట్‌లో అపార అవకాశాలున్నాయన్నారు. నాణ్యత, అధిక దిగుబడులు సాధించడానికి తాము చేసే ప్రయత్నాల్లో భాగస్వాములు కావాలని విజ్ఞప్తి చేశారు. తాము ప్రాధాన్యతలుగా చెబుతున్న రంగాలన్నింటిలో పర్యావరణ హితం ఉంటుందన్నారు. ఇరుగుపొరుగు రాష్ట్రాలతో తమకు చక్కటి సంబంధాలున్నాయని ఆయన వివరించారు.
Top