త్వరలో 25 జిల్లాల రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్..?

Written By Siddhu Manchikanti | Updated: June 14, 2019 10:37 IST
త్వరలో 25 జిల్లాల రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్..?

త్వరలో 25 జిల్లాల రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్..?
 
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన జరిగిన తర్వాత 13 జిల్లాల ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం గా మిగిలింది. ఇటువంటి తరుణంలో త్వరలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 25 జిల్లాల రాష్ట్రంగా ఆవిష్కరించనున్నట్లు మాట్లాడుతున్నారు వైసిపి పార్టీకి చెందిన ఎంపీ విజయసాయిరెడ్డి. ఇటీవల పార్టీ సమావేశంలో విజయసాయిరెడ్డి మాట్లాడుతూ...ఏపీ ముఖ్యమంత్రి వైసీపీ పార్టీ అధినేత జగన్ తాను చేసిన పాదయాత్రలో ఇచ్చిన హామీలను నెరవేర్చడానికి అన్ని విధాలా కృషి చేస్తున్నారని..ప్రజలకు ఇచ్చిన మాటలను ప్రతీది నెరవేర్చాలని దిశగా జగన్ ఆలోచిస్తున్నారని పేర్కొన్నారు.
 
ఇటువంటి క్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న పదమూడు జిల్లాలను ఇరవై ఐదు జిల్లాలు అవుతాయని, ప్రతి పార్లమెంటు నియోజకవర్గానికి ఒక జిల్లా వస్తుందని ఆయన వివరించారు. ప్రజలకు అవినీతి రహిత పాలన అందించి తిరిగి 2024లో అధికారంలోకి రావాలని అన్నారు. గ్రామ వాలంటీర్లుగా చేయాలకునేవారు తప్పనిసరిగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. గ్రామ సెక్రటేరియట్‌ నిర్మాణం జరుగుతోందని, ఇందులో కూడా ఉద్యోగాలు ఉంటాయని చెప్పారు. ప్రతి ఒక్కరూ దరఖాస్తు చేసుకునేలా ప్రోత్సహించాలని అన్నారు.
Top