గుంటూరు పార్టీ కార్యాలయం లో అడుగు పెడుతూనే 40 ఏళ్ల పోలిటికల్ కెరీర్ లో ఎన్నడూ లేని సంచలన ప్రకటన చేసిన చంద్రబాబు !

Written By Siddhu Manchikanti | Updated: July 02, 2019 10:59 IST
గుంటూరు పార్టీ కార్యాలయం లో అడుగు పెడుతూనే 40 ఏళ్ల పోలిటికల్ కెరీర్ లో ఎన్నడూ లేని సంచలన ప్రకటన చేసిన చంద్రబాబు !

టీడీపీ అధినేత చంద్రబాబు సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇటీవల జరిగిన ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ అతి తక్కువ స్థానాలు గెలవడంతో పార్టీలో ఉన్న నేతలు భయభ్రాంతులకు గురి అవుతున్న క్రమంలో టీడీపీ అధినేత చంద్రబాబు తీసుకున్న నిర్ణయాలు అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి. 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న సమయంలో కూడా చంద్రబాబు ఇటువంటి నిర్ణయాలు తీసుకోలేదని తాజాగా బాబు నిర్ణయాలపై టిడిపి నాయకులు వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇంతకీ చంద్రబాబు తీసుకున్న నిర్ణయం ఏమిటంటే. ఇక్క నుండి వారంలో ఐదు రోజుల పాటు గుంటూరు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలోనే పార్టీ కార్యకర్తలకు అందుబాటులో ఉండటానికి చంద్రబాబు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఇందుకోసం గుంటూరు పార్టీ కార్యాలయం సిద్ధమైంది. గుంటూరు అరండల్‌పేటలోని పిచుకులగుంటలో సుమారు 20 ఏళ్ల క్రితం నిర్మించిన జిల్లా కార్యాలయాన్ని గతంలో తాత్కాలికంగా రాష్ట్ర కార్యాలయంగా మార్చారు. గుంటూరులోని రాష్ట్ర కార్యాలయంలో వారానికి ఐదు రోజులు అధినేత చంద్రబాబు, జాతీయ కార్యదర్శి లోకేష్‌లు ప్రజలు, కార్యకర్తలకు అందుబాటులో ఉంటారనే అంశాన్ని పార్టీ నేతలు కూడా ధృవీకరించినట్టు తెలుస్తోంది. ఏదైనా అత్యవసరమైతే తప్ప... చంద్రబాబు, లోకేశ్ పార్టీ కార్యలయానికి రాకుండా ఉండబోరని నేతలు చెబుతున్నారు. మొత్తానికి చంద్రబాబు తాజా నిర్ణయం టీడీపీ శ్రేణులకు ఎంతోకొంత ఊరట కలిగించే విషయమనే చెప్పాలి. మరో పక్క చంద్రబాబు ఇకనుండి వారంలో ఐదు రోజుల పాటు రాష్ట్రం లోనే ఉంటున్న క్రమంలో అధికార పార్టీ నేతల్లో వణుకు మొదలైనట్లు సమాచారం.
Top