సీఎం పదవి చేపట్టిన 6 రోజుల్లోనే మంచి సీఎం అనిపించుకుంటున్న జగన్..!

సీఎం పదవి చేపట్టిన 6 రోజుల్లోనే మంచి సీఎం అనిపించుకుంటున్న జగన్..!

సీఎం పదవి చేపట్టిన 6 రోజుల్లోనే మంచి సీఎం అనిపించుకుంటున్న జగన్..!

వైసిపి పార్టీ అధినేత జగన్ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేయకముందు జగన్ మీడియాతో మాట్లాడుతూ.. సీఎం అయ్యాక జగన్ మంచి ముఖ్యమంత్రి అని ప్రజల చేత ఆరునెలల్లోనే చెప్పించు కొంటాను అని స్టేట్మెంట్ ఇచ్చారు. అయితే తాజాగా ఏపీ ముఖ్యమంత్రి పదవి చేపట్టాక వైఎస్ జగన్ ఆరు నెలల్లో కాదు.. ఆరు రోజుల్లోనే మంచి ముఖ్యమంత్రి అనిపించుకున్నారని ఒక యువతి వ్యాఖ్యానించడం అందరి దృష్టిని ఆకర్షించింది. రోడ్డు పక్కన ఒక బానర్ పట్టుకుని నిలబడ్డ వారిని చూసిన జగన్ వెంటనే కాన్వాయి ఆపి ,వారి సమస్య తెలుసుకున్న తీరు, ఆ తర్వాత స్పందించిన తీరుపై ఆమె ఈ వ్యాఖ్యచేశారు. విశాఖ పర్యటనకు వచ్చిన సీఎం జగన్‌ తిరిగి వెళుతుండగా రోడ్డు పక్కన.. ‘బ్లడ్‌ కేన్సర్‌తో బాధపడుతున్న మా స్నేహితుడిని కాపాడండి’ అంటూ బ్యానర్‌ పట్టుకున్న కొంతమంది యువతీ యవకుడు కనిపించారు. వీరిని చూసిన జగన్‌ వెంటనే కాన్వాయ్‌ ఆపించి కిందికి దిగి నేరుగా వారి వద్దకు వెళ్లారు.కేన్సర్‌తో బాధ పడుతున్న తమ స్నేహితుడు నీరజ్‌ ఆపరేషన్‌కు రూ. 25 లక్షలు ఖర్చవుతుందని, 30 తేదీగా అతడికి ఆపరేషన్‌ చేయించాలని ముఖ్యమంత్రితో వారు చెప్పారు.వెంటనే జగన్ విశాఖ కలెక్టర్ కు ఆదేశాలు ఇచ్చి తగు ఏర్పాట్లు చేయాలని ఆదేశించడం ,ఆ ప్రకారం ఆయన ఆ విద్యార్దుల వద్దకు వెళ్లి వివరాలు తెలుసుకుని తదుపరి చర్యలకు ఉపక్రమించడం జరిగాయి.దాంతో ఆ బానర్ పట్టుకుని నిలబడ్డవారిలో ఒక యువతి సంతోషంతో ఆరు నెలల్లో కాదు.. ఆరు రోజుల్లోనే జగన్ మంచి సి.ఎమ్.అనిపించుకున్నారని వ్యాఖ్యానించింది.Top