నా పై విషప్రచారం జరుగుతుంది అంటున్నా టివి 9 రవి ప్రకాష్..!

Written By Siddhu Manchikanti | Updated: May 10, 2019 09:58 IST
నా పై విషప్రచారం జరుగుతుంది అంటున్నా టివి 9 రవి ప్రకాష్..!

నా పై విషప్రచారం జరుగుతుంది అంటున్నా టివి 9 రవి ప్రకాష్..!
 
తనపై వస్తున్న వార్తల విషయంలో వివరణ ఇవ్వడానికి టివి 9 రవి ప్రకాష్ టివి 9 హెడ్ క్వార్టర్స్ నుంచి మాట్లాడుతున్నానని పేర్కొన్నారు. ఈ సందర్భంగా తనపై వస్తున్న వార్తల విషయంలో రవిప్రకాష్ స్పందిస్తూ వాటిని ఖండించారు. జర్నలిజం అంటే మసాలా వార్త కాదని, సామాజిక సమస్యల గురించి చానల్ పనిచేసిందని రవి ప్రకాష్ పేర్కొన్నారు. తనకు చాలా మంది పోన్ చేస్తున్నారని, ఏమీ ఆందోళన చెందనవసరం లేదని అన్నారు. తాను పరారీలో ఉన్నానని, నిదులు మళ్లించానని ఇలా రకరకాల ప్రచారాలు చేశారని అన్నారు.
 
తాను అజ్ఞాతంలో లేనని అందరికి అందుబాటులోనే ఉన్నానని త్వరలో అన్ని విషయాలు బయటకు వస్తాయని. బయట ఊరు వెల్లడం వల్ల ఆలస్యంగా వచ్చానని అన్నారు. తనపై పెట్టిన తప్పుడు కేసులు నిలవవని అన్నారు. మిగిలిన చానళ్లు బాద్యతాయుతంగా వార్తలు ఇవ్వాలని ఆయన అన్నారు. మిగిలిన వార్తా చానళ్లు క్రెడిబిటిలిటి గా వ్యవహరించాలని రవి ప్రకాష్ సూచించారు. తనను ఎవరూ అరెస్టు చేయలేరని..ఏం తప్పు చేశానని అరెస్టు చేస్తారని ప్రశ్నించారు. జర్నలిజం అంటే సామాజిక బాద్యత అని ఆయన అన్నారు. గందరగోళాన్ని తగ్గించడానికే తాను మాట్లాడుతున్నానని నాపై వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని అవి అన్ని అవాస్తవాలేనని కేవలం నాపై విష ప్రచారం చేయడానికే ఇలా చేస్తున్నారని... వస్తున్న వార్తల్లో నిజం లేదని త్వరలోనే అందరూ తెలుసుకుంటారని రవి ప్రకాష్ క్లారిటీ ఇచ్చారు.
Top