టివి 9 రవి ప్రకాష్ పాస్ పోర్టు పోలీసులు స్వాధీనం..?

Written By Siddhu Manchikanti | Updated: May 10, 2019 10:09 IST
టివి 9 రవి ప్రకాష్ పాస్ పోర్టు పోలీసులు స్వాధీనం..?

టివి 9 రవి ప్రకాష్ పాస్ పోర్టు పోలీసులు స్వాధీనం..?
 
TV9 రవిప్రకాష్ గురించి తెలంగాణ పోలీసులు వేట, ఫోర్జరీ చేసి డైరెక్టర్ల నియమకం,కేసు నమోదు,Tv9 ని ABCL కార్పొరేషన్ నుంచి ఈ మధ్యనే అలంద మీడియా కొనుగోలు చేసింది, Tv9 నుంచి అక్రమంగా నిధులు కూడా పక్కదారి పట్టించిన రవిప్రకాష్, విదేశాలకి పారిపోయాడని అనుమానం… ఈ నేపథ్యంలో కంపెనీ యాజమాన్యం టివి 9 సిఈఓ పదవి నుంచి ఉద్వాసనకు గురైన రవిప్రకాష్ పాస్ పోర్టును పోలీసులు స్వాధీనం చేసుకున్నారన్న వార్తలు బయటకు వస్తున్నాయి. రవి ప్రకాష్ పై టివి 9 కొత్త యాజమాన్యం ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.
 
ఆ పిర్యాదు మేరకు పోలీసులు సోదాలు జరిపారు. రవిప్రకాష్ ఇల్లు, ఆఫీస్ లలో ఈ సోదాలు జరిగాయి. ఈ క్రమంలో ఆయన పాస్ పోర్టును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.పోలీస్ విచారణ నిమిత్తం తమ ముందుకు రావాలని వారు రవిప్రకాష్ ఇంటిలో నోటీస్ కూడా ఇచ్చారు. అలంద మీడియా సంస్థ ఫిర్యాదు మేరకు రవిప్రకాశ్‌పై సైబర్‌ క్రైమ్‌లో 406, 467, ఐటీ యాక్ట్‌ 56 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. కాగా నటుడు శివాజీ ఇంటిలో కూడా సోదాలు చేసినా ఏమీ ప్రత్యేకంగా దొరకలేదు. సంస్థకు హాని కలిగించే దురుద్దేశంతో శివాజీతో దురుద్దేశ పూర్వకంగా కుమ్మక్కై నకిలీ పత్రాలు సృష్టించడమే కాకుండా, సంస్థ యాజమాన్యానికి... కంపెనీ నిర్వాహణలో ఇబ్బందులు కల్పించేలా రవి ప్రకాశ్ ప్రయత్నిస్తున్నారని టీవీ9 యాజమాన్యం పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది.
Top