రవి ప్రకాష్ వెళ్ళిపోగానే టీవీ 9 లో పవన్ కళ్యాణ్ వార్తలు?

Written By Siddhu Manchikanti | Updated: May 12, 2019 11:28 IST
రవి ప్రకాష్ వెళ్ళిపోగానే టీవీ 9 లో పవన్ కళ్యాణ్ వార్తలు?

రవి ప్రకాష్ వెళ్ళిపోగానే టీవీ 9 లో పవన్ కళ్యాణ్ వార్తలు?
 
గత కొన్ని రోజుల నుండి రెండు తెలుగు రాష్ట్రాలలో టీవీ9 రవి ప్రకాష్ గురించి మరియు అతను చేసిన ఫోర్జరీ కేసు గురించి తెగ వార్తలు వినపడ్డాయి. ఈ క్రమంలో చాలామంది రాజకీయ నాయకులు కూడా సోషల్ మీడియాలో టీవీ9 రవి ప్రకాష్ గురించి మరియు జర్నలిజంలో అతడు ఉండి మీడియా ని ఏవిధంగా కొన్ని రాజకీయ పార్టీలకు కొమ్ముకాసే విధంగా వ్యవహరిస్తూ ప్రజలను సమాజాన్ని తప్పుదోవ పట్టించే విధంగా చేసిన చర్యలపై చాలా మంది వివిధ రకాలుగా కామెంట్లు కూడా చేశారు. ఈ నేపథ్యంలో తాజాగా టీవీ9 కొత్త యాజమాన్యం రవి ప్రకాష్ ని కొత్త యాజమాన్యం.. టీవీ9 మీడియాకు సంబంధించిన వాటి నుండి బయటకు పంపించడం జరిగింది.. అంతేకాకుండా రవి ప్రకాష్ కి టీవీ9 కి ఇంకా సంబంధం లేదని కూడా తేల్చి చెప్పేశారు కొత్త యాజమాన్యానికి చెందినవారు. అయితే ఎప్పుడైతే రవిప్రకాష్ టీవీ9 నుండి బయటకు వెళ్లిపోయారో... టీవీ9 లో ప్రస్తుతం పవన్ కళ్యాణ్ పై వార్తలు రావడం అందరికి ఆశ్చర్యాన్ని గురిచేస్తున్నాయి. విషయంలోకి వెళితే అప్పట్లో పవన్ కళ్యాణ్ తల్లిని ఒక సినీ నటి చేత పకడ్బందీగా కొంతమంది కావాలని తిట్టించారని... ఏపీ లో ఉన్న మీడియా చానళ్లపై అప్పట్లో పవన్ కళ్యాణ్ కోప పడడం జరిగింది. ఆ కార్యక్రమాన్ని అంతటినీ డిజైన్ చేసింది రవి ప్రకాషే అంటూ నేరుగా విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టారు. ఆ తర్వాత టీవీ9 పవన్ కళ్యాణ్ వార్తలను ఇవ్వడం మానేసింది. అంతేకాకుండా ఎన్నికల ప్రచారంలో పవన్ కళ్యాణ్ ని కవర్ చేయడం కూడా మానేసింది టీవీ నైన్. అలాగే పవన్ కళ్యాణ్ కూడా టీవీ9 లోగో తో వచ్చిన మైక్ ఉంటే ఇంటర్వ్యూలు ఇవ్వడం మానేశాడు. అయితే ఇప్పుడు రవి ప్రకాష్ టీవీ9 నుంచి నిష్క్రమించిన తర్వాత ఒక్కరోజులోనే పరిస్థితులు మారిపోయాయి. నంద్యాల లో ఎస్.పి.వై.రెడ్డి కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్లిన పవన్ కళ్యాణ్ తో టీవీ9 ప్రతినిధి ఇంటర్వూ తీసుకున్నారు. ఫలితాల మీద తన విశ్లేషణ అడిగి తెలుసుకున్నారు. ఓటర్ సరళి మారింది అని, మే 23 వరకు ఎవరు ఏమి మాట్లాడినా అది కేవలం ఊహాగానాలు మాత్రమేనని పవన్ వ్యాఖ్యానించారు. మొత్తం మీద రవిప్రకాష్ వెళ్ళిపోగానే టీవీ9 లో పవన్ కళ్యాణ్ వార్తలు రావడంతో పవన్ కళ్యాణ్ అభిమానులు జనసేన కార్యకర్తలు కొంత సంతోషించారు.
Top