హైదరబాద్ మిస్సింగ్ కేసులు - అసలేం జరుగుతోంది ఈ సిటీ లో? - EXCLUSIVE REPORT

హైదరబాద్ మిస్సింగ్ కేసులు - అసలేం జరుగుతోంది ఈ సిటీ లో? - EXCLUSIVE REPORT

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా .. ముఖ్యంగా హైదరబాద్ లోపల , చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎక్కువ గా మనుషులు కిడ్నాప్ కి గురి అవుతున్నారు అనే న్యూస్ ఇంటర్నెట్ లో హల్చల్ చేస్తోంది. దీని మీద రకరకాల వాదనలు వినపడుతున్నాయి. ఒక ప్రముఖ దిన పత్రిక " ఏమైపోతున్నారు " అంటూ ప్రచురించిన ఒక కథనం ఆధారంగా చేసుకుని ఈ న్యూస్ ఇంటర్నెట్ లో విరల్ అవుతోంది. దీనికి సంబంధించి రెండు రకాల వాదనలు వినపడుతున్నాయి. ఒక పక్క సోషల్ మీడియా లో నాలుగు వందలకి పైగా వ్యక్తులు గడిచిన నలభై ఐదు రోజుల్లో , నలభై మూడు మండి అమ్మాయిలు గత శనివారం హైదరబాద్ పరిధి లో మిస్ అయ్యారు అని వార్తలు రాస్తుంటే .. పోలీసులు ఆ స్టాటిస్టిక్స్ కరక్ట్ కాదు అని అంటున్నారు.
 
2018 వరకూ జరిగిన మిస్సింగ్ కేసులలో దాదాపు ఎనభై శాతం మందిని తాము మళ్ళీ ట్రెస్ చేశాము అనీ .. ఎప్పటికప్పుడు పోలీసులు స్పెషల్ డ్రైవ్ లు నిర్వహిస్తూ మిస్సింగ్ కేసులని సాల్వ్ చేసే పనిలో బిజీ గా ఉన్నారు అని పోలీసు యంత్రాంగం తమని సమర్ధించుకున్నారు. " పోలీసుల నిర్లక్ష్యం " అంటూ సదరు పత్రిక పెట్టిన హెడ్డింగ్ ని ఖండించారు IPS స్వాతి లక్రా .. ఆడవారి సేఫ్టీ కోసం నిరంతరం పని చేస్తున్నాం అని ఆమె సమాధానం చెప్పారు. తెలంగాణ స్టేట్ పోలీస్ తరఫున ఆమె వివరణ ఇచ్చారు. ఆపరేషన్ స్మైల్ , ఆపరేషన్ ముస్కాన్ అంటూ తాము స్పెషల్ ప్రోగ్రామ్ లు పెట్టి మరీ తప్పిపోయిన చిన్న పిల్లల్ని కాపాడే ప్రయత్నం చేస్తున్నాం అని మిస్సింగ్ పర్సన్స్ యొక్క స్టేటస్ రిపోర్ట్ లతో సహా సోషల్ మీడియా లో ఉంచారు ఆమె. మరొక పక్క మెట్రో పాలిటన్ సిటీ అన్నాక ఇలాంటివి సహజం అనీ .. మిస్ ఐన ప్రతీ కేసు కిడ్నాప్ కాదు అని వాదిస్తున్నారు కొందరు నిపుణులు.
 
ఇంట్లోంచి పారిపోవడం , పరీక్షల ఒత్తిడి తో వెళ్లిపోవడం , భార్యా భర్త గొడవల వలన వెళ్లిపోవడం ఇలాంటి అనేక సందర్భాలని పరిగణలోకి తీసుకున్నప్పుడు కిడ్నాప్ కేసులు వీటిల్లో తక్కువగానే కనిపిస్తున్నాయి. మిస్ ఐన ప్రతీ కేసు నీ మనిషి ఉన్నపళంగా మాయం అయిపోయినట్టు గుర్తించకూడదు అంటున్నారు నిపుణులు. కేవలం బెంగళూరు లోనే రోజుకి దాదాపు నలభై మిస్సింగ్ కేసులు , ముంబై లో రోజుకి ఎనభై మిస్సింగ్ కేసులు నమోదు అవుతూ ఉంటాయి అని అంటున్నారు . ఏదేమైనా పోలీసుల మీద పూర్తి నమ్మకం తో ఉండడమే సదరు పౌరుడి బాధ్యతగా చెప్పాలి.Top