అబ్బో TRS కొంప ముంచే స్కెచ్ బాగానే వేశాడు గా మోడి!

Written By Siddhu Manchikanti | Updated: July 06, 2019 11:08 IST
అబ్బో TRS కొంప ముంచే స్కెచ్  బాగానే వేశాడు గా మోడి!

అబ్బో TRS కొంప ముంచే స్కెచ్ బాగానే వేశాడు గా మోడి!

 
కేంద్రంలో రెండోసారి ప్రధాని అయ్యాక మోడీ పాలనలో దూసుకెళ్లి పోతున్నారు. ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల పైనే మోడీ ఎక్కువ దృష్టి పెట్టారు. రెండోసారి అధికారంలోకి వచ్చాక మోడీ దక్షిణాదిలో కూడా బిజెపి పార్టీ బలం గా ఉండాలని ఇటీవల దక్షిణాది రాష్ట్రాలకు చెందిన నేతలకు సూచించారట. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బిజెపి నేతలకు ఈసారి ఎలాగైనా టిఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయంగా బిజెపి తెలంగాణలో ఎదగాలని మోడీ పేర్కొన్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఇటీవల తెలంగాణ రాష్ట్రంలో తమకు 18 ల‌క్ష‌ల‌మంది స‌భ్య‌త్వం ఉంద‌ని చెప్పారు భాజ‌పా రాష్ట్ర అధ్య‌క్షుడు ల‌క్ష్మ‌ణ్.
 
ఈ నెల‌లో ప్రారంభం కానున్న స‌భ్య‌త్వ నమోదు కార్య‌క్ర‌మం ద్వారా పెద్ద సంఖ్య‌లో స‌భ్యుల‌ను చేర్చాల‌నీ, క‌నీసం 40 శాతం కొత్తవారు న‌మోద‌య్యేందుకు కృషి చేస్తామ‌న్నారు. రాష్ట్రంలో తెరాస‌ను గ‌ద్దెదించి అధికారంలోకి రావ‌డ‌మే త‌మ ల‌క్ష్యం అన్నారు. పెద్ద సంఖ్య‌లో నాయ‌కులు త్వ‌ర‌లో పార్టీలో చేరుతార‌న్నారు. రాహుల్ గాంధీ గురించి ఎంత త‌క్కువ‌గా మాట్లాడుకుంటే అంత మంచిద‌ని, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ రానురానూ నీర‌సించిపోయింద‌ని ల‌క్ష్మ‌ణ్ వ్యాఖ్యానించారు. మరోపక్క మోడీ తెలంగాణ రాష్ట్రంలో రాబోయే ఎన్నికల లోపు తాజాగా అధికారంలో ఉన్న టిఆర్ఎస్ పార్టీ అధికారాన్ని అడ్డంపెట్టుకొని చేస్తున్న ఆగడాలు గురించి అవినీతి గురించి ఇలా ప్రతి విషయంలో బిజెపి పార్టీ నాయకులు పార్టీ పెద్దలకు అప్డేట్ ఇవ్వాలని మోడీ సూచించినట్లు బిజెపి పార్టీ లో వినపడుతున్న వార్త. ఈ పరిణామం బట్టి చూస్తుంటే టిఆర్ఎస్ పార్టీ కొంప ముంచే స్కెచ్ మోడీ వేశారని అంటున్నారు చాలామంది.
Top