21 రోజుల్లో చంద్రబాబు కుర్చీ దిగబోతున్నారు..!

Written By Siddhu Manchikanti | Updated: May 03, 2019 09:37 IST
21 రోజుల్లో చంద్రబాబు కుర్చీ దిగబోతున్నారు..!

21 రోజుల్లో చంద్రబాబు కుర్చీ దిగబోతున్నారు..!
 
టీడీపీ అధినేత ఏపీ సీఎం చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలు అయిపోయిన తర్వాత జాతీయ రాజకీయాలపై ఎక్కువ దృష్టి పెట్టారు. ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ నీ టార్గెట్ చేస్తూ మోడీ పై విమర్శల వర్షం కురిపిస్తున్నారు. ఆయా రాష్ట్రాలలో జరుగుతున్న ఎన్నికలలో కేంద్ర ప్రభుత్వం పై మోడీ పై చంద్రబాబు చేస్తున్న వ్యాఖ్యలను ఏపీ బీజేపీ నేతలు తీవ్రస్థాయిలో ఖండిస్తున్నారు.
 
ఈ నేపథ్యంలో ఏపీ బిజెపి రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు ఇటీవల మాట్లాడుతూ 21 రోజులలో చంద్రబాబు సీఎం కుర్చీ నుండి దిగిపోతున్నారు అంటూ వ్యాఖ్యానించారు. కచ్చితంగా చంద్రబాబు పదవి ఊడిపోవడం ఖాయమని పేర్కొన్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రి పీఠం ఎక్కిన తరువాత రాష్ట్రంలో కరవు కాటకాలతో రైతులు అల్లాడుతున్నా బాబు పట్టించుకోలేదని మండిపడ్డారు. ‘దొంగ డ్రామాలు చేస్తూ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారు. ఎన్నికల నియమావళిని రాజకీయం చేయాలని ఆరాటపడుతున్నారని జివిఎల్ నరసింహారావు అన్నారు.
Top