23 సంఖ్య గురించి మాట్లాడుతూ చంద్రబాబు పై పంచ్ లు వేసిన జగన్..!

23 సంఖ్య గురించి మాట్లాడుతూ చంద్రబాబు పై పంచ్ లు వేసిన జగన్..!

23 సంఖ్య గురించి మాట్లాడుతూ చంద్రబాబు పై పంచ్ లు వేసిన జగన్..!
 
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తాజాగా వైసీపీ పార్టీ తరఫున గెలిచిన ఎమ్మెల్యేలు ఎంపీలతో సమావేశమయ్యారు ఏపీకి త్వరలో కాబోయే ముఖ్యమంత్రి వైఎస్ జగన్. ఈ సమావేశంలో జగన్ మాట్లాడుతూ ఎన్నో పోరాటాల తర్వాత మనం అదికారంలోకి వచ్చామని అన్నారు. గెలిచిన ఎమ్మెల్యేలంతా వైఎస్ ఆర్ కాంగ్రస్ శాసనసభ పక్ష నేతగా జగన్ ని ఎన్నుకున్నారు. గతసారి కేవలం ఒక శాతం ఓట్ల తేడా అంటే ఐదు లక్షల ఓట్ల వత్యాసంతో అదికారం కోల్పోయామని, ఆ తర్వాత చంద్రబాబు ప్రభుత్వం నుంచి ఎన్నో వేదింపులు, ఇబ్బందులు పడ్డామని ఆయన అన్నారు.
 
ఇప్పుడు క్లీన్ స్వీప్ చేయగలిగామని అంటూ, ఓటింగ్ శాతం ఏభై శాతం మన పార్టీకి వచ్చిందంటే చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ విషయమని ఆయన అన్నారు. అన్యాయాలు చేస్తే దేవుడు మొట్టికాయలు వేస్తాడనడానికి చంద్రబాబు ప్రభుత్వ ఓటమి పెద్ద ఉదాహరణ అని ఆయన అన్నారు. మనపార్టీ నుంచి ఎమ్మెల్యేలను 23 మందిని చంద్రబాబు కొనుగోలు చేస్తే ఇప్పుడు అదే ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలను మాత్రమే చంద్రబాబుకు దేవుడు ఇచ్చారని ఆయన అన్నారు. అది కూడా మే ఇరవై మూడున అని ఆయన అన్నారు. చంద్రబాబుకు దేవుడు మొట్టి కాయలు వేశాడని ఆయన అన్నారు.Top