40 ఏళ్ల చంద్రబాబు రాజకీయ అనుభవం పై తీవ్ర విమర్శలు చేసిన విజయసాయిరెడ్డి..!

Written By Siddhu Manchikanti | Updated: May 08, 2019 12:03 IST
40 ఏళ్ల చంద్రబాబు రాజకీయ అనుభవం పై తీవ్ర విమర్శలు చేసిన విజయసాయిరెడ్డి..!

40 ఏళ్ల చంద్రబాబు రాజకీయ అనుభవం పై తీవ్ర విమర్శలు చేసిన విజయసాయిరెడ్డి..!
 
ఒకపక్క వైసిపి పార్టీ ఎన్నికల ప్రచారం జరుగుతోంది మరోపక్క ఆ పార్టీ సీనియర్ నాయకుడు విజయసాయిరెడ్డి తెలుగుదేశం పార్టీ నేతలకు చుక్కలు చూపించారు. ఢిల్లీ నుండి గల్లీ వరకు వైసిపి పార్టీని ఇబ్బందులపాలు చేయాలని చూసినా టిడిపి నేతలకు మరియు ఆ పార్టీకి కొమ్ముకాసే ప్రభుత్వ అధికారులకు చాలా తలనొప్పిగా మారారు విజయసాయిరెడ్డి. అయితే అంతటితో ఆగకుండా విజయసాయిరెడ్డి ఇంకా తన విమర్శల దాడిని సోషల్ మీడియా సాక్షిగా సంచలన కామెంట్ లు పెడుతూ ఏపీ రాజకీయాన్ని రసవత్తరంగా మారుస్తున్నారు.
 
ఈ నేపథ్యంలో తాజాగా పోలవరం ప్రాజెక్టుపై మరియు చంద్రబాబు వివి ప్యాట్ ల అంశం పై కూడా విజయాయి రెడ్డి మరోసారి తన ట్విట్టర్ ద్వారా చంద్రబాబుపై నిప్పులు చెరిగారు.పోలవరం ప్రాజెక్టు కోసం మాట్లాడుతూ..“పోలవరం నిర్మాణ బాధ్యతల నుంచి కేంద్రాన్ని తప్పించే స్కీమ్‌లో భాగమే స్పెషల్‌ ప్యాకేజీ. అందుకోసం చంద్రబాబు రాష్ట్ర భవిష్యత్తునే ఫణంగా పెట్టారు. చేనుకు చేవ…రైతుకు రొక్కం అన్న మాదిరిగా కమిషన్ల ప్రవాహంతో పోలవరం బాబుకు వరం, తమ్ముళ్ళకు జీవనాడి అయింది. కాగ్‌ కూడా అదే చెప్పింది.” అని అలాగే “చంద్రబాబు మెంటల్ బ్యాలన్స్ కోల్పోయాడు. అన్ని వివిప్యాట్లను లెక్కించడం సాధ్యం కాదని కిందటి సారే సుప్రీం తేల్చి చెప్పింది. కోర్టు తీర్పును తప్పు పట్టేలా మాట్లాడాడు. మళ్లీ సుప్రీంలో రివ్యూకు వెళ్తే కర్రు కాల్చి వాత పెట్టింది. 40 ఏళ్లలో స్వార్థం తప్ప హుందాతనాన్ని అలవర్చుకోలేదు.” అంటూ చంద్రబాబు పై సంచలన వ్యాఖ్యలు చేసారు.
Top