50 కోట్లు చేతిలో పెడితే మోడీ ని చంపేస్తా..?

Written By Siddhu Manchikanti | Updated: May 08, 2019 11:55 IST
50 కోట్లు చేతిలో పెడితే మోడీ ని చంపేస్తా..?

50 కోట్లు చేతిలో పెడితే మోడీ ని చంపేస్తా..?
 
సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక చాలా మంది గుర్తింపు కోసం రకరకాల వీడియోలు చేయడం లేకపోతే వివాదాస్పదమైన అంశాలపై లైవ్ వీడియోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం ఇంకాస్త పెద్దగా పాపులర్ అవ్వాలని సెలబ్రిటీలపై సినిమా హీరోల పై ఇష్టానుసారంగా వ్యాఖ్యలు చేయడం మనం చూస్తూనే ఉన్నాం. ఈ నేపథ్యంలో తాజాగా ఒక ఆగంతకుడు ప్రదాని మోడీని చంపుతానంటూ బెదిరించిన ఒక వీడియో వెలుగులోకి వచ్చిందని సమాచారం. తనకు రూ.50 కోట్లు ఇస్తే ప్రధానిని చంపేస్తానని బిఎస్ ఎఫ్ మాజీ జవాన్ తేజ్ బహదూర్ చెప్పడం ఆ వీడియోలో వినబడుతోంది.
 
ఇతడు మోడీపై పోటీచేయడానికి విఫల యత్నం చేసిన వ్యక్తి కావడం గమనార్హం. కాగా ఇది రెండేళ్ల నాటిదని , ఇది నకిలీదా, కాదా అన్నది తెలియవలసి ఉందని అంటున్నారు. ఆ వీడియోలో ఉన్నది తానేనని అంగీకరించిన తేజ్ బహదూర్ దానివెనక కుట్ర ఉందని ఆరోపించారు. బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు మాట్లాడుతూ తేజ్‌బహదూర్ వీడియో చూసి నిర్ఘాంతపోయినట్టు చెప్పారు. రూ.50 కోట్లు ఇస్తే మోదీని చంపేస్తానని ఆయన కొంతమందితో చెబుతున్నాడని అన్నారు. ఇటువంటి సంఘ విద్రోహ శక్తుల వెనక ఉండేది కాంగ్రెస్సేనని ఆరోపించారు. తేజ్ బహూదర్ తన స్నేహితులతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారని పోలీసులు అంటున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారింది.
Top