Advertisement

CBI దాడులు మొదలు పెట్టారు... ఆంధ్రప్రదేశ్ లో హడావిడి మొదలు!

by Siddhu Manchikanti | July 10, 2019 11:46 IST
CBI దాడులు మొదలు పెట్టారు... ఆంధ్రప్రదేశ్ లో హడావిడి మొదలు!

CBI దాడులు మొదలు పెట్టారు .. ఆంధ్రప్రదేశ్ లో హడావిడి మొదలు !
 
ఆంధ్ర రాష్ట్రంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కేంద్ర ప్రభుత్వం ఏపీలో సిబిఐ దాడులు చేస్తున్న క్రమంలో చంద్రబాబు సంచలన నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి తెలియకుండా రాష్ట్రంలో సిబిఐ దాడులు చేయడానికి కుదరదని జీవో పాస్ చేశారు. అయితే ప్రస్తుతం ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రి జగన్ అయిన తర్వాత చంద్రబాబు ఇచ్చిన జీవోను రద్దు చేస్తూ రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన విచారణ సంస్థలు అభ్యంతరం లేకుండా విచారణ చేయవచ్చని జీవో జారీ చేయడంతో... తాజాగా కేంద్ర విచారణ సంస్థ సీబీఐ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హడావిడిగా సిబిఐ దాడులు మొదలు పెట్టింది.
 
ఈ క్రమంలో ముఖ్యమంత్రి జగన్ ని గతంలో ఈడీ కేసులో అనేక ఇబ్బందులకు గురిచేసిన ఈడీ మాజీ జాయింట్‌ డైరెక్టర్‌ గా పని చేసిన అధికారి శ్రీనివాస గాంధీ నివాసంలో సీబీఐ సోదాలు చేసింది. హైదరాబాద్‌, విజయవాడలో ఏక కాలంలో సీబీఐ సోదాలు నిర్వహించారు. ప్రస్తుతం కేంద్ర జీఎస్‌టీ విభాగంలో సూపరింటెండెంట్‌గా శ్రీనివాస గాంధీ ఉన్నారు. శ్రీనివాస గాంధీపై… జగన్మోహన్ రెడ్డి.. నేరుగా ప్రధానికే పలుమార్లు అధికారిక లేఖల ద్వారా ఫిర్యాదు చేశారు. అక్రమాస్తుల కేసుల్లో.. ఈడీ.. జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తులుగా భావించిన అనేక ఆస్తులను ఎప్పటికప్పుడు జప్తు చేసింది. ఈ జప్తులు చేయడంలో.. అప్పట్లో దర్యాప్తు అధికారులుగా ఉన్న ఉమాశంకర్ గౌడ్, శ్రీనివాసగాంధీ అనే అధికారులు చురుగ్గా వ్యవహరించారు. వీరిద్దరూ వేధిస్తున్నారని.. గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రధానికి ప్రత్యేక లేఖ రాసి.. కలిసి మరీ ఇచ్చి వచ్చారు. అయితే ప్రస్తుతం జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సీబీఐ విచారణ సంస్థ మొట్టమొదటి టార్గెట్ గా శ్రీనివాస్ గాంధీ కి సంబంధించిన ఇళ్లపై సోదాలు చేయడంతో ఈ విషయం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోనూ జాతీయ రాజకీయాలలో పెద్ద హాట్ టాపిక్ అయింది.


Advertisement


Advertisement


Top