బిగ్ బాస్ లో రొమాన్స్ ఎక్కువ అయిందా?

Written By Siddhu Manchikanti | Updated: July 24, 2019 14:38 IST
బిగ్ బాస్ లో రొమాన్స్ ఎక్కువ అయిందా?

బిగ్ బాస్ లో రొమాన్స్ ఎక్కువ అయిందా?
 
బిగ్ బాస్ సీజన్ 3 మొదటి రోజు నుండి చాలా రసవత్తరంగా సాగుతోంది. రెండవ రోజు నామినేషన్ల ప్రక్రియ తప్పించుకోవడానికి బిగ్ బాస్ కొన్ని అవకాశాలుఇవ్వటం జరిగింది. ఈ సందర్భంగా నామినేషన్ రీప్లేస్ ప్రక్రియ చాలా ఉత్కంఠభరితంగా సాగగా ఇంటి సభ్యు ల మధ్య చిన్నపాటి గొడవలు మనస్పర్థలు చోటు చేసుకోవడంతో షో మరింత రసవత్తరంగా మారింది. ఇటువంటి పరిస్థితిలో జంటగా ఇంటి సభ్యులు అయినా వరుణ్ సందేశ్, వితికాల రొమాన్స్ ఎపిసోడ్ తెలుగు ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేస్తుంది.
 
ఒక పక్క నామినేషన్ రీప్లేస్ జరుగుతూ రసవత్తరంగా మారిన హౌస్‌లో మరోపక్క వరుణ్, వితికాల రొమాన్స్ కూడా ఆకట్టుకుంది. వరుణ్ సందేశ్, ఆయన భార్య వితికాతో అవకాశం దొరికినప్పుడల్లా రొమాన్స్ చేస్తూ ముద్దుముద్దుగా మాట్లాడిన సంఘటనలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. బెడ్ రూమ్‌లో వరుణ్ పక్కనే ఓ బెడ్‌పై మహేష్ విట్ట పడుకోని ఉన్నాడు. అక్కడ ఇంకెవ్వరూ లేకపోవడంతో ఈ భార్యాలిద్దరూ మాట్లాడుకుంటూ మాట్లాడుకుంటూనే ఒకరినొకరు గట్టిగా కౌగిలించుకున్నారు. కెమెరా మనవైపే చూస్తుందంటూ వితిక రొమాన్స్‌కు పుల్ స్టాప్ పెట్టేసింది. దీంతో చాలామంది వీక్షకులు హౌస్‌లో కొంచెం రొమాన్స్ ఎక్కువ అయ్యింది అని అంటున్నారు.
Top