మహేశ్ ని కర్రోడా అనడం ఏంటి అసలు .. బుద్ధిందా రవి నీకు?

Written By Siddhu Manchikanti | Updated: July 25, 2019 15:06 IST
మహేశ్ ని కర్రోడా అనడం ఏంటి అసలు .. బుద్ధిందా రవి నీకు?

మహేశ్ ని కర్రోడా అనడం ఏంటి అసలు .. బుద్ధిందా రవి నీకు ?
 
బిగ్ బాస్ హౌస్ లో తాజాగా ఇచ్చిన టాస్క్ తెలుగు టెలివిజన్ ప్రేక్షకులను ఎంతగానో కడుపుబ్బా నవ్విస్తుంది. ఇటువంటి క్రమంలో కమెడియన్ మహేష్ ని కర్రోడా అంటూ చేసిన కామెంట్లు హౌస్ లో హీటేక్కిస్తున్నయ్యి. ఇటీవల జరిగిన ఎపిసోడ్ లో బిగ్ బాస్ హౌస్ మేట్స్ అందరికీ చిన్నతనంలోకి బాల్యంలోకి వెళ్లిపోవాలని అందరూ ఐదు నుండి పదేళ్ల పిల్లలు మాదిరి ప్రవర్తించాలని ప్రతి ఒక్కరు ఈ టాస్క్ చేయాలని చెప్పినా కానీ..మహేష్ మాత్రం సైలెంట్ గా బెడ్ మీద పడుకున్నాడు, మహేష్ గేమ్ ఆడుతున్నాడో లేడో అనే విషయం రవికృష్ణ, రోహిణికి తెలుసో లేదో కానీ, ఆ కర్రోడు మొన్న ఏమో అది చేస్తా, ఏది చేస్తా,,,నా సత్తా చూపిస్తా అన్నాడు ఇపుడేమో ఆ మూలాన పడుకున్నాడని రవికృష్ణ అన్నాడు.
 
దీనితో పక్కన వున్నా బాబా భాస్కర్ మాట్లాడుతూ మహేష్ మీ వెనకే వున్నాడు సీరియస్ అవుతున్నాడని చెప్పటంతో సైలెంట్ గా ఉన్నాడు. దీనితో మహేష్ మాట్లాడుతూ మహేష్ గాడు, వాడు, వీడు అని పిలువు ఒప్పుకుంటా కానీ, కర్రోడు, పొట్టోడు అంటారెందుకు చదువుకున్నారు కదా..? నాకు మీలా ఓవర్ యాక్షన్ చేయటం నచ్చదు అందుకే నేను టాస్క్ ఆడటంలేదు.. కర్రోడు అంటే బాగోదు అంటూ గట్టిగా వార్నింగ్ ఇచ్చాడు. దీంతో రోహిణి..రవి కృష్ణ కి మహేశ్ ని కర్రోడా అనడం ఏంటి అసలు అంటూ సీరియస్ కావడంతో...రవికృష్ణ మహేష్ కి క్షమాపణ చెప్పే ప్రయత్నం చేశాడు.
Top