బిగ్ బాస్ 3 హౌస్ లో ఆ అమ్మాయిని చూస్తే భయపడుతున్నారు అందరూ!
బిగ్ బాస్ 3 హౌస్ లో ఇంటి సభ్యులు అందరూ ఒకలా ప్రవర్తిస్తుంటే హిమజ మాత్రం గేమ్ స్ట్రాటజీ తో గేమ్ స్టార్ట్ చేసింది. బిగ్ బాస్ సీజన్ 2లో కౌశల్ మాదిరిగా హిమజ ప్రవర్తించడం ఇప్పుడు అందరికీ ఆశ్చర్యం గురిచేస్తోంది. సీజన్ 2లో కూడా కౌశల్ అందరూ నిద్ర లేవకముందే రెడీ అయిపోయి ఉండేవాడు. అలాగే బిగ్ బాస్ ఇచ్చిన పని ఇంటి సభ్యుల అందరికంటే ముందే చేసి ఎప్పుడెప్పుడా అన్నట్టుగా వ్యవహరించేవాడు. కొన్ని కొన్ని సార్లు హౌస్ లో ఎవరు చెప్పినా చెప్పకపోయినా పని చెప్పినా చెప్పకపోయినా చేసేవాడు.
ఇప్పుడు అదే విధంగా సీజన్ 3లో హిమజ ప్రవర్తించడం గమనార్హం. ఇటీవల ఎపిసోడ్ లో అయితే ఎర్లీ మార్నింగ్ 5 .30 కి బాత్ రూమ్ సింకు క్లినింగ్ చేయటమ లాంటివి చేసింది. తన గేమ్ స్ట్రాటజీ లో భాగంగా చాలా తెలివిగా తాను చేసిన పనులు ఎవరు చూడకపోతే ఎలా అనే ఉద్దేశ్యంతో హౌస్ లో ఎవరితో ఒకరితో ఆ టాపిక్ తీసుకొనివచ్చి, తాను చేసిన పనిగురించి చెపుతుంది. ఇవన్నీ మిగిలిన హౌస్ మేట్స్ గమనిస్తూనే ఉన్నారు. ముఖ్యంగా శ్రీముఖి ఈ విషయంలో హిమజ మీద గట్టి ఫోకస్ పెట్టింది. అందుకే ఇటీవల నామినేట్ సమయంలో ఆ టాపిక్స్ తీసుకొనివచ్చింది. దీంతో హిమజా వేస్తున్న ఎత్తుగడలు చూసి మిగిలిన ఇంటి సభ్యులు భయాందోళనకు గురవుతున్నట్లు ప్రస్తుతం హౌస్ లో ఉన్న పరిణామాలను బట్టి తెలుస్తోంది.