బిగ్ బాస్ అతిపెద్ద గొడవ మీద నాగార్జున ఏమన్నాడు అంటే .. !
బిగ్ బాస్ షో ప్రారంభం కాకముందే షో నిర్వాహకులపై షాకింగ్ కామెంట్ చేశారు గాయత్రీ గుప్తా, న్యూస్ యాంకర్ శ్వేతారెడ్డి. బిగ్ బాస్ షో లోకి మమ్మల్ని తీసుకుంటామని చెప్పి అవకాశాలు ఇచ్చి లైంగిక వేధింపులకు గురిచేసి మా జీవితాలతో ఆడుకుంటున్నారని షో నిర్వాహకులపై… పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. అదేవిధంగా మరియు బిగ్ బాస్ సీజన్ 3 షో ఆపేయాలని ఈ ఫిర్యాదులో పేర్కొన్నడం జరిగింది. దీంతో ఈ అతి పెద్ద గొడవ అడ్డం పెట్టుకుని కొంతమంది షోకి హోస్ట్ గా వ్యవహరిస్తున్న నాగార్జున ఇంటిపై దాడికి పాల్పడటం కూడా జరిగింది. ఇటువంటి నేపథ్యంలో తాజాగా తన ఇంటిపై జరిగిన దాడి గురించి అలాగే షో నిర్వాహకులపై బిగ్ బాస్ హౌస్ పై జరిగిన అతి పెద్ద గొడవ గురించి మాట్లాడుతూ...ప్రపంచంలో 13 దేశాలలో ఈ షో కి మంచి ఆదరణ ఉందని..ఇండియాలో హిందీలో ఇప్పటికే 12 సీజన్లు బిగ్ బాస్ షో ప్రసారం అవటం జరిగిందని.
అలాగే తెలుగు తమిళంలో మూడవ సీజన్ ప్రస్తుతం సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది అని నాగార్జున మాట్లాడుతూ ఇంత ఆదరణ ఉన్న షోపై లేనిపోని ఆరోపణలు వస్తే..బయట ఉన్న ప్రభుత్వాలు పోలీసులు ఉంటాయా అంటూ ప్రశ్నలు వేస్తూ...తప్పు చేస్తే ఎవరైనా మన చట్టాలు మన ప్రభుత్వాలు ఊరుకుంటాయా శిక్ష విధించడం గ్యారెంటీ అంటూ నాగార్జున మాట్లాడుతూ ఏదిఏమైనా జరిగిన వివాదాలు గొడవల్లో పోలీసులు వాళ్ళ పని వారు చేసుకుంటూ పోతారు తప్పు జరిగితే కఠినంగా శిక్షిస్తారు అంటూ బిగ్ బాస్ హౌస్ గురించి వినబడుతున్న గొడవల పై నాగార్జున తన అభిప్రాయాలు వ్యక్తం చేశారు.