Bigg Boss Telugu S03: తన ఎలిమినేషన్ పై సెన్సేషనల్ కమెంట్స్ చేసిన హేమ..!
వరుస వివాదాలతో షో స్టార్ట్ అవ్వకముందు బయట జరిగిన బిగ్ బాస్ షో సీజన్ 3 ఇంటి లోపల కూడా అవే గొడవలు ఇంటి సభ్యుల మధ్య జరుగుతూ ఉండటం విశేషం. షో ప్రస్తుతం రసవత్తరంగా ఇంటిలో వాతావరణం నెలకొంది . ముఖ్యంగా ఇంటి సభ్యుల మొదటి ఎలిమినేషన్ లో ఇంటి సభ్యురాలైన టాలీవుడ్ ఇండస్ట్రీ సీనియర్ నటి హేమ ఇటీవల షో నుండి బయటకు ఎలిమినేట్ అయిన సందర్భం మనకందరికీ తెలిసినదే. ఇదే క్రమంలో వైల్డ్ కార్డు రూపంలో తమన్నా సింహాద్రి ఇంటిలోకి ఎంట్రీ ఇచ్చింది.
ఇదిలా ఉండగా తాజాగా ఎలిమినేషన్ ప్రక్రియలో షో నుండి బయటకు వచ్చేసిన హేమ సెన్సేషనల్ కామెంట్స్ చేసింది. ‘తనను కావాలనే ఈ షో నుండి ఎలిమినేట్ చేశారని, బిగ్‌బాస్ హౌస్‌లో ఒకటి జరిగితే, బయటకు వేరేలా చూపించారని, అంతేకాకుండా తన చేతలు కమాండింగ్ అనిపించాయని, అయినప్పటికీ కూడా నేను నార్మల్‌గానే చెప్పానని హేమ పేర్కొన్నారు. అసలు వంటగది వల్లే హౌస్‌లో గొడవలు వచ్చాయని, అందరి మంచి గురించి నేను చెప్తే, నాకే చెడు జరిగిందని తెలిపారు. ఒకవైపు అక్క అంటూ మర్యాద ఇస్తూనే, మరొకవైపు తన వెనకాల గోతులు తవ్వారు అని అక్క తోపు అంటూ ఇంటిలో నుంచి బయటకు తోసేశారని చాలా తెలివిగా హౌస్ సభ్యులు గేమ్ ఆడుతున్నట్లు హేమ పేర్కొంది.