Bigg Boss Telugu S03: బాబా మాస్టర్ పై బిగ్ బాస్ గుర్రు..!
వైల్డ్ కార్డ్ ఎంట్రీ రూపంలో తమన్నా సింహాద్రి బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వటంతో హౌస్ లో కొత్త వాతావరణం నెలకొంది. మొత్తంమీద ఈ షో చూసుకుంటే బిగ్ బాస్ ఉద్దేశం ఒకటే ఎలాగోలాగా ఇంటిలో రచ్చ జరగాలి ఈ ప్రోగ్రాం చూస్తున్న ప్రేక్షకుడు ఎంటర్టైన్ అవ్వాలి అన్నట్టుగా హౌస్ లో ఎన్విరాన్మెంటల్ క్రియేట్ చేస్తున్నారు బిగ్ బాస్. ఈ సందర్భంగా రెండో ఎలిమినేషన్ ప్రక్రియ అప్పుడే స్టార్ట్ చేశారు. దీంతో ఇంటి సభ్యులు ఎవరిని ఎలిమినేట్ చేయాలి అన్నదానిపై బిగ్ బాస్ కి అందరూ తమ అభిప్రాయాన్ని చెప్పుకున్నారు.
అయితే బాబా భాస్కర్ మాత్రం హౌస్ లో ఎవరిని ఎలివేట్ చేయడానికి తన దగ్గర కారణాలు కనబడలేదని అందరూ మంచివారే నని అవసరమైతే నన్ను ఎలిమినేట్ చేయండి బిగ్ బాస్ అంటూ మొదటిసారి కన్వెన్షన్ రూమ్ కి వచ్చిన సందర్భంలో బాబా భాస్కర్ తన అభిప్రాయం చెప్పుకోవడం జరిగింది... ఇదే క్రమంలో బిగ్ బాస్ ఆట రూల్స్ ప్రకారం ఎవరినో ఒకరిని ఎలిమినేషన్ నామినేట్ చేయాలని చెప్పినా గానీ బాబా భాస్కర్ మంచితనంగా అందరూ నాకు కనబడుతున్నారు అని చెప్పుకోవడంతో... ఒకానొక సందర్భంలో చివరాకరికి ఇంటి సభ్యులందరి చేత ఈ విషయం బిగ్ బాస్ చర్చించుకునే దాకా రావటంతో ఒకానొక సందర్భంలో బాబా మాస్టర్ పై ఈ ప్రక్రియలో భాగంగా గుర్రు గా కోప పడటం జరిగింది. ఇటీవల షో లో జరిగిన ఈ సన్నివేశం ఎపిసోడ్ కె పెద్ద హైలెట్ గా నిలిచింది.