అందరూ అనుకున్నట్టుగానే హౌస్ నుండి ఎలిమినేట్ అయిపోయాడు టీవీ9 యాంకర్ జాఫర్. సండే ఎపిసోడ్లో హౌస్ కి గెస్ట్ గా వచ్చిన ఇస్మార్ట్ శంకర్ హీరో రామ్ చేత యాంకర్ నాగార్జున జాఫర్ ఎలిమినేట్ అవుతున్నట్లు ప్రకటించారు. చివరి ఎపిసోడ్ లో ఉత్కంఠభరితంగా సాగిన ఈ ఎలిమినేషన్ కార్యక్రమంలో చివరిగా మిగిలిన నలుగురిని సభ్యులు జాఫర్, వరుణ్, వితిక, పునర్నవి ల మధ్య చాలా ఉత్కంఠభరితంగా సాగింది. ముఖ్యంగా ఎలిమినేషన్ ఎవరు అవుతారు అని జాఫర్ ఎలిమినేట్ కాకముందు యాంకర్ నాగార్జున ఇంటి సభ్యుల అభిప్రాయాన్ని అడగగా 7గురు జాఫర్ కు మద్దతు తెలిపారు. 6 గురు వితికని సపోర్ట్ చేశారు. కానీ ప్రేక్షకుల ఓట్ల ప్రకారం జాఫర్ ఎలిమినేట్ అవుతున్నట్లు నాగార్జున ప్రకటించాడు. జాఫర్ ఇంటి నుంచి ఏడుస్తూ బయటకు వచ్చాడు జాఫర్. హౌస్ నుండి బయటకు వచ్చాక స్టేజి పైకి వచ్చిన జాఫర్ బిగ్ బాస్ హౌస్ గురించి ముందు తనకు చెడు అభిప్రాయం ఉండేదని పక్కా స్క్రిప్ట్ తో ఇంటిలో ఉన్న సభ్యులు నటిస్తున్నారని అనుకున్నాను కానీ...హౌస్ లోకి ఎంటర్ అయ్యాక ఇది హృదయపూర్వకంగా హాట్ ఫుల్ గా హౌస్ సభ్యులు ఆడుతున్నారని పేర్కొన్నారు.