చంద్రబాబు నాయుడు: విశాఖపట్నంలో ‘‘గో బ్యాక్ బాబు’’ అంటూ వైసీపీ నిరసన
తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తన ప్రజా చైతన్య యాత్రలో భాగంగా గురువారం విశాఖపట్నం చేరుకున్నారు. ఆయన్ను అడ్డుకునేందుకు, నిరసన తెలిపేందుకు వైసీపీ నాయకులు విమానాశ్రయానికి వచ్చారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు భద్రత దృష్ట్యా ఆయన్ను సెక్షన్ 151 కింద ముందస్తు అరెస్ట్ చేస్తున్నట్లు పోలీసులు ప్రకటించారు. చివరగా వెనక్కి పంపిస్తున్నట్లు తెలిపారు.