కరోనావైరస్: చైనా దాటి ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న కేసులు
కరోనావైరస్ ప్రమాద తీవ్రత చాలా ఎక్కువవుతోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది. మరిన్ని దేశాలకు ఈ మహమ్మారి వ్యాపిస్తోంది. మరోవైపు, కరోనావైరస్ సృష్టిస్తున్న పరిస్థితుల ప్రభావానికి ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్లు కుప్పకూలాయి.