పెరిగిన వెంకీ మామ జోరు, అయినా కొట్టలేదు బోరు

By Xappie Desk, December 13, 2018 18:18 IST

పెరిగిన వెంకీ మామ జోరు, అయినా కొట్టలేదు బోరు

ఆరు పదుల వయసు కి దగ్గరవుతున్న వెంకీ సినిమాల ఎంపిక విషయంలోను వాటి విడుదల విషయంలోను కుర్రహీరోలకు పోటి వస్తున్నాడు వచ్చే సంవత్సరం వరుణ్ తేజ్ తో ఒకసారి తన మేనల్లుడు నాగచైతన్యతో ఇంకోసారి ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.

తన మేనల్లుడు నాగచైతన్యతో కలిసి నటిస్తున్న చిత్రం వర్కింగ్ టైటిల్ వెంకీ మామ. ఈ చిత్రానికి కె.ఎస్.రవీంద్ర అలియాస్ బాబి దర్శకత్వం వహిస్తున్నాడు.ఈ చిత్రాన్ని కోన వెంకట్ సమర్పణలో సురేష్ బాబు నిర్మిస్తున్నాడు.ఈ చిత్రానికి వెంకటేష్ కి జోడీగా శ్రియా సరన్ మరియు నాగ చైతన్య రకుల్ ప్రీత్ సింగ్ నటించబోతున్నట్లు తాజా సమాచారం.

ఈచిత్రంలో మామా మేనల్లుడు కలిసి నటించడంతో దీనిపై భారీ అంచనాలు నెలకొన్నాయి.వరస పరాజయాలతో సతమతమవుతున్న నాగచైతన్య కి మేనమామ వల్ల అదృష్టం మారుతుందో లేదో చూడాలి.ఇప్పటికే ఈ చిత్రంలో నాగచైతన్య మీద కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరించారు.అయితే విక్టరీ వెంకటేష్ పొంగల్ షెడ్యూల్ నుండి ఈ మూవీ షూటింగ్ లో పాల్గొన్న పోతున్నాడని తాజా అప్డేట్.

Journalists, who have passion for witting actuate news. If you want to write for Xappie as a full time or part-time. Please Mail us on content@xappie.com


Forum Topics


Top