గూగుల్ లో టాప్ ట్రెండింగ్ దక్షిణ భారత సినిమాలు

By Xappie Desk, December 15, 2018 12:17 IST

గూగుల్ లో టాప్ ట్రెండింగ్ దక్షిణ భారత సినిమాలు

గూగుల్ వాళ్లు ప్రతి సంవత్సరం చివరాఖరున యూజర్లను ఎక్కువగా వెతికిన పదాలను సినిమాలను హీరోలను సెలబ్రిటీల గురించి ఒక ఒక లిస్ట్ రిలీజ్ చేస్తారు. అలా ఈ సంవత్సరం యూజర్లు ఎక్కువగా వెతికిన దక్షిణ భారత సినిమా ల లిస్ట్ ఇచ్చారు.
 
ఆ లిస్టులో మొదటి స్థానంలో మన రౌడీ విజయ్ దేవరకొండ నటించిన గీతగోవిందం నిలిచింది. మోస్ట్ గూగుల్ చేసిన సెలబ్రిటీస్ ఇన్ సౌత్ ఇండియాలో విజయ్ దేవరకొండ నాలుగో స్థానాన్ని సంపాదించుకున్నాడు. ఇళయ దళపతి విజయ్ నటించిన సర్కార్ మూవీ రెండో స్థానంలో నిలిచింది. రామ్ చరణ్ నటించిన రంగస్థలం మరియు మహేష్ బాబు నటించిన భరత్ అనే నేను మూడు నాలుగు స్థానాల్లో నిలిచాయి. సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన కాలా అలాగే రోబో టు పాయింట్ జీరో ఐదు ఆరు స్థానాల్లో నిలిచాయి. ఇక కీర్తి సురేష్, సమంత ,విజయ్ దేవరకొండ,దుల్కర్ సల్మాన్ ప్రధాన పాత్రలు పోషించిన మహానటి చిత్రం ఏడో స్థానంలో ను నాని ,అనుపమ పరమేశ్వరన్,రుక్సర్ కలిసి నటించిన కృష్ణార్జున యుద్ధం చిత్రం ఎనిమిదో స్థానంలో నిలిచింది.
 
సినిమా రిజల్ట్స్ ఎలా ఉన్నా గూగుల్ ఇచ్చిన జాబితాలో వాళ్ళ సినిమాలు ఉంటే పబ్లిసిటీ పని చేసింది అని కంక్లూజన్స్ కోస్తున్నారు. చెడు లో కూడా మంచి వెతుక్కో అని పెద్దలు చెప్పిన సామెత నిజమే అని వీళ్ళ పద్ధతిని చూస్తే అర్థమవుతుంది.
 


Forum Topics


Top