ఎన్టీఆర్ బయోపిక్ కు దెబ్బ

By Xappie Desk, December 15, 2018 17:25 IST

ఎన్టీఆర్ బయోపిక్ కు దెబ్బ

నందమూరి బాలకృష్ణ నటిస్తూ స్వయంగా నిర్మిస్తున్న ఎన్టీఆర్ బయోపిక్ చిత్రానికి తెలంగాణలో ఎదురుదెబ్బ తగలనుంది. ఈ చిత్రంలో స్టార్ కాస్ట్ మూలంగా దీని బడ్జెట్ ఇప్పటికే తడిసి మోపెడయింది. ఇలాంటి భారీ బడ్జెట్ చిత్రాలు లాభాలు మూట కట్టుకోవాలంటే ప్రీమియర్ షోలో దిక్కు. గతంలోనే టిఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణలో చిత్రా ప్రీమియర్ షోలకు నో చెప్పింది.
 
అందులో బాలయ్య ఈసారి తెలంగాణ ఎన్నికల ప్రచారంలో టిడిపి తరఫున ప్రచారం చేస్తూ టిడిపి గెలవడమే లక్ష్యంగా టీఆర్ఎస్ పై విమర్శనాస్త్రాలుతో చెలరేగిపోయారు. గతంలో తెరాస బాలకృష్ణ నటించిన పౌరాణిక చిత్రం గౌతమీపుత్ర శాతకర్ణి కి పన్ను మినహాయింపు అలాగే ప్రీమియర్ షోలకు పర్మిషన్ లను ఇచ్చింది. కానీ ఆయన ఈసారి చేసిన విమర్శలకు గాను టిఆర్ఎస్ ప్రభుత్వం ఎన్టీఆర్ బయోపిక్ చిత్రానికి మినహాయింపులు ఇస్తారో లేదో చూడాలి.
 
కెసిఆర్ గారికి సీనియర్ ఎన్టీ రామారావు గారు అంటే ఎంతో అభిమానం ఈ విషయాన్ని ఆయన ఎన్నో సందర్భాల్లో వ్యక్తం చేశారు. ఆయన మీద అభిమానంతోనే తన కుమారునికి కూడా అదే పేరుని పెట్టుకున్నారు. అలాంటి ఎన్టీఆర్ బయోపిక్ చిత్రానికి బాలయ్య చేసిన విమర్శలు మినహాయింపులకు అడ్డు అవుతాయా అనేది వేచి చూడాలి
 


Forum Topics


Top