స్క్రీన్ కేనా సొసైటీకి కూడా అంటున్న అల్లు అర్జున్

By Xappie Desk, December 16, 2018 10:09 IST

స్క్రీన్ కేనా సొసైటీకి కూడా అంటున్న అల్లు అర్జున్

తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ప్రస్తుతం ఉన్న టాలెంటెడ్ యంగ్ హీరోలలో అల్లు అర్జున్ ఒకడు. యాక్టింగ్ లోను డాన్స్ లోను తానేంటో నిరూపించుకున్న ఈ తరం మేటి నటుల లో ఇతనొకడు. హీరోగా భారీ బడ్జెట్ చిత్రాల్లో నటిస్తున్న సమయంలోనే ప్రయోగాత్మక చిత్రమైన రుద్రమదేవిలో సపోర్టింగ్ రోల్ లో నటించి మెప్పించి నేటితరం నటులకు ఇన్స్పిరేషన్ గా నిలిచాడు.
 
ఈ మెగా మేనల్లుడు తన క్రేజ్ ని తెలుగులోనే కాక మలయాళం వరకు పాకేలా చేశాడు. మలయాళంలో అల్లు అర్జున్ ని మల్లు అర్జున్ అని పిలుస్తుంటారు అక్కడ స్టార్ హీరోలకు ఉన్నట్లు అల్లు అర్జున్ కూడా ఫ్యాన్ బేస్ ఉంది. అందుకే అల్లు అర్జున్ మలయాళంలో స్ట్రైట్ సినిమా చేస్తానని ఇప్పటికే ప్రకటించాడు. ఇప్పటివరకు మల్లు ప్రేక్షకులు అల్లు అర్జున్ పై ప్రేమను చూపిస్తూ వచ్చారు.
 
ఇప్పుడు అల్లు అర్జున్ ఒక అడుగు ముందుకు వేసి అలప్పుజ జిల్లాలోని 10అంగన్వాడీలను దత్తత తీసుకున్నాడు. మొన్నీమధ్యనే వచ్చిన వరదల ధాటికి కేరళ అల్లకల్లోలమైన అప్పుడు కూడా 25 లక్షలు కేరళ ప్రభుత్వానికి విరాళం ఇచ్చి తనకు కేరళ పై ఉన్న ప్రేమను చాటుకున్నాడు. అలాగే తను స్క్రీన్ మీదే కాదు రియల్ లైఫ్ లోనూ హీరోనే అని తన ఉదారతతో చాటుకున్నాడు.


Forum Topics


Top